కిరణ్ అబ్బవరం సినిమా వాయిదా!

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:28 PM

కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ 'హతః' సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 6న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Hatah Movie

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న సినిమా 'హతః'. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న 'హతః' సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అయితే ఇప్పుడా సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.


ఈ సినిమా గురించి దర్శకుడు అనుష్‌ గోరక్ మాట్లడుతూ, 'చాలా సినిమాలకు నేపథ్యంగా ప్రాంతం, సంప్రదాయం, పురాణాల నుంచే రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఎలాంటి బౌండరీస్ లేకుండా చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అలాంటి అరుదైన సినిమా ఇది. ఏ ప్రాంతం వాళ్లు ఈ సినిమా చూసినా అది తమ దగ్గరే జరిగింది అనుకునేలా ఉంటుంది. మా మూవీలో కూడా వివిధ ప్రాంతాల నటీనటులు ఉన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. విజువల్స్, బీజీఎం... ఇలా థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. అందుకే విడుదల విషయంలో ఆచితూచి అడుగు వేయబోతున్నాం' అని అన్నారు. ఈ మిస్టికల్ థ్రిల్లర్ మూవీలో కొంత హారర్ ఉంటుంది. ఈ మూవీ కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్ లోనే ఎక్సిపీరియన్స్ చేయాలి' అని అన్నారు.

ఇది ఇలా ఉంటే కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'రియాలిటీ' మూవీ డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

ఇట్లు అర్జునకి అండగా ఎన్టీఆర్..

Updated Date - Nov 04 , 2026 | 12:36 PM

Trivikram: ప్రభాస్‌లోని ఆ టాలెంట్‌ను ఎవరూ సరిగ్గా వాడుకోలేదు..

Radhika Apte: లెజెండ్.. ఆ సినిమా చూస్తేనే అసహ్యం వేస్తుంది

నందమూరి మోక్షజ్ఞకి హీరోయినే దొరకడం లేదా..

విడాకుల తర్వాత రెండో పెళ్లికి సిద్ధమైన రిమి టామీ.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

ఆనంద్ బక్షి సినీ ప్రస్థానం.. తెలుగులోకి 'నగ్మే, కిస్సే, బాతే, యాదే'