Radhika Apte: లెజెండ్.. ఆ సినిమా చూస్తేనే అసహ్యం వేస్తుంది
ABN , Publish Date - Nov 03 , 2026 | 03:26 PM
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు. డబ్బు కోసం, పేరు కోసం తెలుగు చిత్రాల్లో నటించి.. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి టాలీవుడ్ పై జోక్స్ వేస్తున్నారు. తాము నటించిన సినిమాలు అసలు సినిమాలే కావని, గ్లామర్ చూపించడం తప్ప ఏమి లేదని వెటకారం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారు. డబ్బు కోసం, పేరు కోసం తెలుగు చిత్రాల్లో నటించి.. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లి టాలీవుడ్ పై జోక్స్ వేస్తున్నారు. తాము నటించిన సినిమాలు అసలు సినిమాలే కావని, గ్లామర్ చూపించడం తప్ప ఏమి లేదని వెటకారం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామ రాధికా ఆప్టే (Radhika Apte) ప్రతిసారి చిన్న ఛాన్స్ దొరికినా కూడా తెలుగు సినిమాలపై పడిపోతుంది. రక్త చరిత్ర సినిమాతో రాధికా తెలుగుతేరకు పరిచయమైంది. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రాధికాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీని తరువాత బాలయ్యతోనే లయన్ సినిమాలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం అక్క సిరీస్ ప్రమోషన్స్ లో రాధికా మరోసారి సౌత్ సినిమాపై అనుచిత కామెంట్స్ చేసి తెలుగువారిని అవమానించింది. ఇలా సౌత్ సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాధికాకి కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలాసార్లు లెజెండ్ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడింది. అయితే ఈసారి మాత్రం తెలుగు సంస్కృతిని అవమానించిందని నెటిజన్స్ మండిపడుతున్నారు. లెజెండ్ చిత్రంలో బాలకృష్ణ అక్క కూతురుగా రాధికా కనిపించింది. తెలుగు, తమిళ్ సంస్కృతిలో మేనమామ- మేనాకోడలిని పెళ్ళాడడం తప్పు కాదు. కానీ, ఆమె ఆ ఆచారాన్ని తప్పు పట్టింది.
'ఒక తెలుగు సినిమాలో నేను నా సొంత మేనమామ పాత్ర కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా కంటే వయసులో చాలా పెద్దవాడైన ఆ నటుడు నాకు మేనమామ.. అతడితో నేను రొమాన్స్ చేయాలి. పెళ్లి చేసుకోవాలి. ఆ తరువాత సడెన్ గా నా పాత్ర చనిపోతుంది. నన్ను అతని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఇలాంటి పూర్తి పితృస్వామ్య వాతావరణం ఉన్న చోట నటించడం నా కెరీర్లోనే అత్యంత కష్టమైన విషయం. ఆ వాతావరణాన్ని, ఆ క్యారెక్టర్‌ను నేను తీవ్రంగా అసహ్యించుకున్నాను' అని చెప్పుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందు 'తెలుగు సినిమాలో అవకాశం రావడమే నా అదృష్టం' అని చెప్పిన ఆమె, విడుదలైన పుష్కరకాలం తర్వాత అదే సినిమాపై వెటకారంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలో పద్ధతిగా పెళ్లి చేసుకునే సాంప్రదాయమైన పాత్ర ఇస్తే అసహ్యించుకున్న ఆమెకు, బాలీవుడ్లో బోల్డ్ క్యారెక్టర్లు ఇచ్చి ఒంటిపై బట్టలు లేకుండా కనిపించమంటే మాత్రం అది సరైన పాత్రగా అనిపిస్తుందేమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాకుండా అసలు ఎవరు ఒప్పుకోమన్నారు అలాంటి క్యారెక్టర్స్ ని.. డబ్బు కోసం, పేరు కోసం సినిమాలని ఒప్పుకొని.. ఇప్పుడు కొద్దిగా ఫేమస్ అయ్యేసరికి అవన్నీ చిరాకు అని చెప్తున్నావా అంటూ తిట్టిపోస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Ritika Singh: నా పేరుతో.. నాకు తెలియకుండానే సబ్ స్క్రిప్షన్ రూ.400 వసూలు చేస్తున్నారు
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది