సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శర్వా ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ విడుదల.. ఎలా ఉందంటే

ABN, Publish Date - Sep 24 , 2026 | 06:34 PM

వరుస విజయాలతో జోరు మీదున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’ నుంచి గ్లింప్స్ విడుదలైంది.

George Krish First Booster

వరుస విజయాలతో జోరు మీదున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand), వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’ (George Krish). ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి శర్వా సిద్ధమవుతున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఏటీవీ సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ చిత్ర ఫస్ట్ బూస్టర్ (గ్లింప్స్)ను అధికారికంగా విడుదల చేశారు.


యూట్యూబ్‌లో విడుదలైన ఈ ఫస్ట్ బూస్టర్ (George Krish First Booster) శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రతిబింబిస్తూ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ఇందులో శర్వానంద్ రెండు విభిన్న మతాలకు చెందిన విభిన్న కోణాల పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. క్రిస్టియన్ ఫాదర్ గెటప్‌లో ‘జార్జ్’గా, హిందూ భక్తుడి గెటప్‌లో ‘క్రిష్’గా శర్వా చూపించిన కామిక్ టైమింగ్, హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఒకవైపు చర్చిలో సిస్టర్స్‌తో కలిసి నవ్వుతూ ప్రార్థనల్లో మునిగిపోతూనే, మరోవైపు ఆలయ ప్రాంగణంలో నమశ్శివాయ భజనల్లో పరవశించిపోతున్న శర్వా లుక్స్ ఈ కథపై అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో సాగే ఈ రెండు షేడ్స్ మధ్య శ్రీను వైట్ల తనదైన శైలిలో రాసుకున్న సరికొత్త కథాంశం ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.


ఈ బూస్టర్‌లో శర్వానంద్ ఎంతో స్టైలిష్ కార్పొరేట్ లుక్‌లోనూ దర్శనమిచ్చి చార్మింగ్ స్టార్ ఇమేజ్‌ను చాటగా, కథానాయిక మానస వారణాసి గ్లామరస్‌గా మెరిశారు. లీడ్ పెయిర్ మధ్య సాగే ఆధునిక ప్రేమకథ తాలూకు ఫీల్ కూడా ఇందులో కనిపించింది. అనూప్ రూబెన్స్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజికల్ స్కోర్ ఈ వీడియోకు హైలైట్‌గా నిలవగా, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ సినిమాకు రిచ్ లుక్ తెచ్చిపెట్టాయి. సరికొత్త హ్యూమర్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్.. ఇది నటసింహం రేంజ్!

Chiranjeevi: చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా?

The Paradise Review : ది ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

Updated Date - Sep 24 , 2026 | 06:34 PM