Chiranjeevi: చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా?

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:58 PM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ‘దసరా’తో మాస్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవిని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారనే చర్చ అప్పట్లోనే మొదలైంది. అయితే ఇప్పుడు నానితో ఆయన తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ విడుదల కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరోసారి చర్చ మొదలైంది.

‘ది ప్యారడైజ్’ (The Paradise) గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఉండగా.. ఫస్ట్ షో తర్వాత ప్రేక్షకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. నాని నటన, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్‌ను కొందరు ప్రశంసిస్తుండగా.. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, సెకండాఫ్ విషయంలో మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సినిమాపై సోషల్ మీడియాలో మిశ్రమ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానుల్లో ఓ ప్రశ్న మొదలైంది. ‘ది ప్యారడైజ్’ ఫలితం ప్రభావం చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌పై ఉంటుందా? దర్శకుడి సినిమా ఫలితాన్ని బట్టి తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అయితే  ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అధికారికంగా ప్రకటించారు. కథలో ఏమైనా తేడా ఉంటే మార్పులు చేస్తారేమో  గానీ,  మాట ఇచ్చిన తర్వాత చిరు కూడా వెనకడుగు వేయరు. దీనినిబట్టి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి మార్పు ఉండదని కూడా టాక్ నడుస్తోంది. సినిమా యధావిధిగా  ఉంటుందని మరికొందరు అంటున్నారు. శ్రీకాంత్ ఓదెల కూడా ‘ది ప్యారడైజ్’ తర్వాత కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. సినిమా విడుదల తర్వాత మూడు నెలలు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తదుపరి చిరంజీవి సినిమాపైనే ఫోకస్ పెడతారని తెలుస్తోంది. ‘దసరా’లో మాస్ ఎలిమెంట్స్‌ను బలంగా చూపించిన ఓదెల.. మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎలాంటి కథను సిద్ధం చేశారు? చిరంజీవిని కొత్తగా ఎలా చూపించబోతున్నారు? అనే అంశాలు కీలకంగా మారనున్నాయి. 

ఇవి కూడా చదవండి:

The Paradise Review : ది ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

‘జార్జ్ క్రిష్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫిక్స్

రామ్ చరణ్-సుకుమార్ RC17పై క్రేజీ అప్‌డేట్

హీరోయిన్ కాదు.. రాకాలో రష్మికకు భారీ ట్విస్ట్?

Updated Date - Sep 24 , 2026 | 04:31 PM