జీడిఎన్ సినిమా రావడం సంతోషదాయకం...
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:21 AM
భారత ఎడిసన్‌గా పేరొందిన జీడీ నాయుడు జీవిత చరిత్ర ‘అప్పా- మా నాన్న జీడీ నాయుడు’ పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జీడీఎన్’ సినిమా నేపథ్యంలో ఈ పుస్తకం తెలుగులో పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.
భారత్ ఎడిసన్ గా పేరు తెచ్చుకున్న జీడీ నాయుడు జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం 'జీడీఎన్'. పాన్ ఇండియా స్థాయిలో ఇటీవల విడుదలైన ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను మాధవన్ పోషించారు. తాజాగా జీడీయన్ జీవిత గాథ పుస్తక రూపంలో తెలుగులోనూ వచ్చింది. దానిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దేశంలో తొలి పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి సాంకేతిక విద్యకు పునాది వేసిన తెలుగు వ్యక్తి గోపాలస్వామి దొరైస్వామి (జీడీ) నాయుడు జీవితం యువతకు స్ఫూర్తి దాయకమ'ని అన్నారు. తమిళనాడు పాఠశాలల్లో ఆయన జీవిత చర్రితను పాఠ్యాంశంగా బోధిస్తుండడం గర్వకారణమని చెప్పారు. భారత ఎడిసన్ గా పేరు పొందిన జీడీ నాయుడి జీవితం ఆధారంగా మాధవన్ ప్రధాన పాత్రలో 'జీడీఎన్' సినిమా రావడం సంతోషకరమన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, వ్యవసాయ రంగాల్లో కోయంబత్తూరు కేంద్రంగా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేసిన జీడీ నాయుడి సేవలను సర్ సీవీ రామన్ సైతం కొనియాడారని గుర్తు చేశారు.
జీడీ నాయుడి జీవిత చరిత్రను ఆయన కుమారుడు గోపాల్ చెబుతున్న కథనంగా ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరి రాయగా, దాన్ని ఇసనాక మురళీధర్ 'అప్పా- మా నాన్న జీడీ నాయుడు' పేరుతో తెలుగులోకి అనువదించారు. పుస్తకం తొలి ప్రతిని నందమూరి రామకృష్ణ స్వీకరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జి.డి. నాయుడు మనవడు, జి.డి. ఛారిటీస్ ట్రస్టీ జి.డి. రాజ్ కుమార్, పుస్తక సంపాదకుడు గుడిపూడి సుబ్బారావు, తెలుగు అనువాదకులు ఇసవాక మురళీధర్, సీనియర్ పాత్రికేయుడు మా శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?
Sunday TV Movies: అక్టోబర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు
‘వారణాసి’ తర్వాత జక్కన్న మనకు కనబడరా..