ఒకప్పటి బాలనటి హీరోయిన్‌గా...

ABN , Publish Date - Sep 07 , 2026 | 07:19 PM

ఒకప్పటి బాలనటి ప్రాముఖ్య ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. పవన్ కేసరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సోమవారం మొదలైంది.

పవన్ కేసరి, ప్రాముఖ్య హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా #LUB. మహేశ్ కుమార్ సంక, భగవాన్ నిర్మిస్తున్న ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మణికంఠ పెదమల్లు తెరకెక్కిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి క్లాప్ ఇవ్వగా, 'హనుమాన్' చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్ చిత్ర దర్శకుడు మణికంఠ దర్శకత్వం చేయగా, స్క్రిప్టును 'క్రేజీ కల్యాణం' చిత్ర నిర్మాత బి జగన్ మోహన్ రెడ్డి, బివిఎస్ రవి అందజేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన 'సంబరాల ఏటిగట్టు' చిత్ర దర్శకుడు రోహిత్ కెపి, దర్శకుడు సముద్ర, నిర్మాతలు లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా పవన్ కేసరి మాట్లాడుతూ, 'ఇది రోమ్ కోమ్, కామెడీ, లవ్‌తో కూడిన ఎమోషన్ ఉన్న చిత్రం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. చాలా మంచి కథతో మేము ఈ సినిమా మొదలుపెట్టాము. ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తాం' అని అన్నారు. నటి ప్రాముఖ్య మాట్లాడుతూ, 'ఇది నా తొలి చిత్రం. నా ఆడిషన్ చూసి నాకు చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకులకు, నిర్మాతలకు థాంక్స్. సినిమాలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. సినిమా టీం అంతా కొత్త వారే. ఈ చిత్ర బృందం అందరితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.


చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'ఓ మంచి కథతో సినిమా చేయాలనే ప్యాషన్‌తో చిత్ర పరిశ్రమకు వచ్చాం. మాకు సపోర్ట్ గా నిలిచిన మా దర్శకుడు, హీరోకు థాంక్స్. మంచి కంటెంట్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాం. కొత్తవారితో మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాం. మా హీరోయిన్ బాల నటిగా ఇప్పటికే కొన్ని సినిమాలలో చేశారు. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు' అని అన్నారు. ఎమోషన్స్‌తో కూడిన రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు మణికంఠ చెప్పారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రాలను అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ అండ్ సన్స్ ఫేమ్ హారిక, భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్ తదితరులు పోషించనున్నారు. సుధ శ్రీనివాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Bipasha Basu: ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న బ్లాక్ బ్యూటీ 

Varanasi: రాజమౌళి ఎక్క‌డా.. త‌గ్గ‌డం లేదుగా

January 12 Vidudala: అనిల్ రావిపూడికి.. కొత్త టెన్ష‌న్‌!

ఇక‌.. ఒక్క‌రైనా సీట్లో కూర్చుంటే ఒట్టు

Updated Date - Sep 07 , 2026 | 07:24 PM