ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా.. సినిమా ప్రారంభం
ABN, Publish Date - Aug 29 , 2026 | 04:24 PM
తెలంగాణ మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు పవన్ హీరోగా శనివారం ఓ మూవీ ప్రారంభమైంది.
తెలంగాణ మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు పవన్ (Kittu Pavan) హీరోగా శనివారం ఓ మూవీ ప్రారంభమైంది. యం.యస్ వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నం 3గా ముని శివ, శివమల్లాల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాదాపూర్ శివమ్ మీడియా కార్యాలయంలో ప్రారంభమైన ఈ చిత్రానికి దిలీప్ సాయి నాయక్ దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, దర్శకుడు ఆర్.పి పట్నాయక్, నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న, విజయ్ వెన్నం వంటి వారు పాల్గొన్నారు. దర్శకుడు దిలీప్‌కి స్క్రిప్ట్‌ని సతీష్ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్ అందించగా.. హీరో కిట్టుపై చంద్రబోస్ క్లాప్ నిచ్చారు. ఆర్‌పి పట్నాయక్ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా.. విజయ్ వెన్నం కెమెరా స్విచ్ఛాన్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.
అనంతరం రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ టీమ్ గురించి నాకు బాగా తెలుసు. అంతా ఎంతో టాలెంట్ ఉన్నవారు. నిర్మాతలు ముని శివ, శివమల్లాల, బుల్లెట్‌బండి లక్ష్మణ్, సంగీత దర్శకుడు మదిన్ నాకు ఎంతో ఆత్మీయులు. వారందరూ చేస్తున్న ఈ ప్రయత్నం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. మంచికథతో వచ్చిన దర్శకుడు దిలీప్‌కి మా శివలిద్దరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వీరందరికి పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఆర్‌పి పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ నిర్మాతలిద్దరూ మంచి సినిమాలు చేసి పెద్ద నిర్మాతలుగా మారి పదులకొద్ది సినిమాలు తీయాలని కోరుతున్నాను. ఈ సినిమా టీమ్ అందరికీ మంచి సినిమాగా మారాలని అన్నారు. హీరో కిట్టు పవన్ మాట్లాడుతూ.. నేనొక చిన్న నటునిగా ఫోక్ సాంగ్స్ చేసేవాడిని. అలాంటిది నేను చేస్తున్న ఈ సినిమాకి ఇంత పెద్దవాళ్లు వచ్చి సపోర్ట్ చేయటం ఎంతో ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ నుంచి ‘ఏషనాగుల’ మాస్ ఫోక్ ఆంథమ్ వచ్చేసిందోచ్
‘ఇరుముడి’ ఓటీటీకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ వివరాలివే
హారర్ మూవీతో తాప్సీ టాలీవుడ్ రీ-ఎంట్రీ.. దర్శకుడెవరంటే