‘ది ప్యారడైజ్’ నుంచి ‘ఏషనాగుల’ మాస్ ఫోక్ ఆంథమ్ వచ్చేసిందోచ్

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:58 PM

నేచురల్ స్టార్ నాని, డైనమిక్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది.

The Paradise Song Still

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), డైనమిక్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘ఆయా షేర్’ ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ (Yeshanagula Song) పాటను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో నాని సమక్షంలో ఈ పాటను ముందుగా ఆవిష్కరించగా, ఇప్పుడు డిజిటల్‌గా విడుదలైన ఈ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన ఈ హై-వోల్టేజ్ ఫోక్ మాస్ ఆంథమ్ మొదటి బీట్ నుంచే ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన పక్కా లోకల్ తెలంగాణ ఫోక్ లిరిక్స్ ‘ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాలా.. మనం ఊగుదామే బాలా’ పాటకు ప్రాణంగా నిలిచాయి. ప్రభా బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి తమ పవర్‌ఫుల్ జానపద గాత్రంతో పాటను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. వీడియోలో నాని తన ఊరమాస్ రా లుక్‌లో కనిపిస్తూ ఎనర్జిటిక్ మూమెంట్స్‌తో దుమ్మురేపగా, కీర్తి సురేష్ చేసిన స్పెషల్ డ్యాన్స్ అండ్ గ్లామరస్ ఫోక్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


ఆట సందీప్, జ్యోతి రాజ్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ పాటలోని దాబా వైబ్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో వందలాది డ్యాన్సర్ల మధ్య సాగే విజువల్స్, సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండియర్‌ను స్పష్టంగా చూపించాయి. మొత్తం మీద ‘ఏషనాగుల’ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్, స్టెప్పులు వేయించేలా అదిరిపోయే మాస్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం సహా పలు అంతర్జాతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

ఇవి కూడా చదవండి:

‘ఇరుముడి’ ఓటీటీకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ వివరాలివే

హారర్ మూవీతో తాప్సీ టాలీవుడ్ రీ-ఎంట్రీ.. దర్శకుడెవరంటే

‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్.. పొలిటికల్ హీట్ పెంచిన పవర్‌ఫుల్ డైలాగ్స్

Updated Date - Aug 29 , 2026 | 03:58 PM