‘ఇరుముడి’ ఓటీటీకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ వివరాలివే
ABN , Publish Date - Aug 29 , 2026 | 02:35 PM
మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇరుముడి’. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వచ్చేశాయి.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా, ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. రవితేజ కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ‘ఇరుముడి’, భావోద్వేగాలతో కూడిన కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ ఘన విజయంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన యశ్ ‘టాక్సిక్’ వంటి భారీ బడ్జెట్ చిత్రం బరిలోకి దిగినప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఆ పోటీని సైతం తట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో స్ట్రాంగ్ కలెక్షన్లను రాబడుతోంది. రవితేజ మార్క్ ఎనర్జీతో పాటు త్రినాథ్ పాత్రలో ఆయన పండించిన ఎమోషన్స్, శివ నిర్వాణ టేకింగ్, జీవీ ప్రకాశ్ సంగీతం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. థియేటర్లలో ఇంకా కలెక్షన్ల సునామీ కొనసాగుతున్న తరుణంలోనే, ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను భారీ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి, అంటే సెప్టెంబర్ 18 నుంచి ‘ఇరుముడి’ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో అధికారికంగా స్ట్రీమింగ్ (Irumudi OTT Streaming Details) చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన నాలుగు వారాల విండో తర్వాత తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించి ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం, ఓటీటీ వేదికపై గ్లోబల్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో కట్టిపడేస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
హారర్ మూవీతో తాప్సీ టాలీవుడ్ రీ-ఎంట్రీ.. దర్శకుడెవరంటే
‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్.. పొలిటికల్ హీట్ పెంచిన పవర్‌ఫుల్ డైలాగ్స్
‘తలైవర్’తో సెల్ఫీ.. నమ్మలేని నిజం: కయాదు లోహర్