మక్కల్ సెల్వన్ వదిలిన ‘ఫీల్ మై లవ్’ ఫస్ట్ లుక్
ABN, Publish Date - Jul 16 , 2026 | 12:03 AM
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఫీల్ మై లవ్’. ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు.
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఫీల్ మై లవ్’ (Feel My Love). ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టైటిల్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) రిలీజ్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతి ‘ఫీల్ మై లవ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అందమైన ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథనంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలుపుతున్నారు. చెన్నై, పుదుచ్చేరిలోని అద్భుతమైన లొకేషన్లలో సినిమాని చిత్రీకరించారు. మూనార్, కొడైకెనాల్‌లో 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం చివరి దశ పనులను పూర్తి చేసుకుంటోంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఎం.ఎస్. సతీష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు. అజయ్ మనోజ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..
KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో
మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్