సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Fauzi: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ‘ఫౌజీ’ పోస్టర్ అరాచకం

ABN, Publish Date - Aug 15 , 2026 | 05:53 PM

రెబల్ స్టార్ ప్రభాస్, క్లాసిక్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ నుంచి న్యూ పోస్టర్ విడుదలైంది.

Fauzi Independence Day Special Poster

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), క్లాసిక్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi). గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్‌ల టి-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ, సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేస్తోంది.


తాజాగా రిలీజైన ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ (Independence Day Special Poster) అత్యంత ఇంటెన్స్‌గా, మునుపెన్నడూ చూడని ఊర మాస్ వైబ్‌తో డిజైన్ చేశారు. ఇందుకు ముందు వచ్చిన పోస్టర్‌కు కొనసాగింపుగా.. రక్తం కారుతున్న వైట్ బనియన్, ధోతీ కట్టులో ఉన్న ప్రభాస్ రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని అడుగులు వేస్తున్న విజువల్ రోమాంచితంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో చారిత్రక చార్మినార్ పరిసరాలు కాలిపోతూ ఉండటం, పక్కనే ఒక గాంధీ తాత తరహాలో ఓ వృద్ధుడు కర్ర పట్టుకుని నడుస్తున్న దృశ్యాలు సినిమాలోని బలమైన భావోద్వేగాలను, నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. పోస్టర్‌పై ఉన్న ‘A BATTALION WHO FIGHTS ALONE’ అనే క్యాప్షన్, ప్రభాస్ పాత్ర స్వభావాన్ని, ఆయన ఒంటరి పోరుని తెలియజేస్తోంది.


‘‘స్వాతంత్ర్యం ఒక వేడుకగా మారడానికి ముందు, అది ఒక భీకర యుద్ధం! మన రేపటి భవిష్యత్తు కోసం పోరాడిన ప్రతి సైనికుడి స్ఫూర్తికి మా సెల్యూట్” అంటూ చిత్రయూనిట్ వెల్లడించిన సందేశం దేశభక్తి భావాలను రేకెత్తిస్తోంది. పూర్తి రా అండ్ రగ్గడ్ అవతారంలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాకపోతే ఫేస్ కూడా చూపించి ఉంటే బాగుండేదనేలా కామెంట్స్ పడుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మాస్ అండ్ ఎమోషనల్ పోస్టర్ నెట్టింట ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ సినీ ప్రస్థానం.. ఈ విషయాలు తెలుసా

Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే

నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్

Updated Date - Aug 15 , 2026 | 05:53 PM