టాలీవుడ్‌లో విషాదం.. ఆ ఎడిటర్ కన్నుమూత!
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:37 PM
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రముఖ ఎడిటర్, హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఎడిటర్ మధు రెడ్డి (Editor Madhu Reddy), హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. మధు రెడ్డి మరణవార్త తెలిసి.. ఆయన సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మధు రెడ్డి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెబుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
కరీంనగర్‌కు చెందిన మధు రెడ్డి, తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood)లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసి, తనదైన గుర్తింపును పొందారు. ఎడిటర్‌గా ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్ వంటి విషయాలను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ‘దళం’, ‘దక్ష’, ‘అహ నా పెళ్ళంట’ వంటి చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహించారు. త్వరలోనే విడుదలకానున్న ‘అగ్ని నక్షత్రం’ చిత్రానికి కూడా ఆయనే ఎడిటర్. కేవలం ఫీచర్ ఫిలిమ్స్‌కు మాత్రమే కాకుండా.. వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ‘జగడం’, ‘జల్సా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ట్రైలర్ కట్ చేసింది మధు రెడ్డినే.
మధు రెడ్డి గురించి తెలిసిన వారంతా.. తన వృత్తి పట్ల ఎంతో అంకితభావం, ఎప్పుడూ ఒదిగి ఉండే మనస్తత్వం ఆయన సొంతమని చెబుతున్నారు. ఆయన వర్క్‌లో ఎప్పుడూ ఒక స్పష్టత ఉంటుందని, అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం అంటూ, కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!
Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!
పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.