సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dulquer Salmaan: అది ఫేక్ అకౌంట్.. నమ్మి మోసపోవద్దు

ABN, Publish Date - Sep 28 , 2026 | 02:59 PM

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలు తెరవడం, నెగటివ్  ప్రచారం చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం.

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలు తెరవడం, నెగటివ్  ప్రచారం చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పేరుతో ఓ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ అవ్వడం.. ఆయన పేరుతో పోస్ట్ లు దర్శనం ఇవ్వడంతో దుల్కర్  దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.  తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులను అప్రమత్తం చేస్తూ.. ఆ ఫేక్ అకౌంట్ ను  నమ్మొద్దని స్పష్టం చేశారు. ఆ అకౌంట్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదని దుల్కర్ తెలిపారు.

‘‘ఆ ఖాతాలో నేను పోస్టులు చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. సినిమాలు, సహనటులు, ఇతర అంశాలపై నా పేరుతో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. నా కుటుంబ సభ్యులకు కూడా నా పేరుతో నకిలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దయచేసి ఇలాంటి పోస్టులను నమ్మవద్దు’’ అంటూ ఆయన అభిమానులకు సూచించారు. 

ఈ వ్యవహారంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దుల్కర్ వెల్లడించారు. ఫేక్ అకౌంట్‌పై చర్యలు తీసుకోవాలని ఎక్స్ యాజమాన్యాన్ని కూడా సంప్రదించినప్పటికీ.. ఇప్పటివరకు వారి నుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు. తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. సెలబ్రిటీల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి అభిమానులను తప్పుదోవ పట్టించే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో దుల్కర్ చేసిన ఈ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల పేర్లతో వచ్చే పోస్టులను అధికారిక ఖాతాల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతే నమ్మాలని అభిమానులకు సూచిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఇటీవల ‘ఐ యామ్ గేమ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

ALSO READ:

అప్పుడు వెంకీకి నేనెవరో తెలియదు: త్రివిక్రమ్

సోషల్ మీడియా వేదికగా పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు

సూర్యతో సినిమా ఎప్పుడు?.. రాజమౌళి ఏమన్నారంటే

Updated Date - Sep 28 , 2026 | 03:02 PM