సూర్యతో సినిమా ఎప్పుడు?.. రాజమౌళి ఏమన్నారంటే

ABN , Publish Date - Sep 28 , 2026 | 08:15 AM

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత జక్కన్న మూవీ ఏంటనే దానిపై వస్తున్న వార్తలకు ఆయన క్లారిటీ ఇచ్చారు.

Suriya and SS Rajamouli

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) నుంచి సినిమా వస్తోందంటే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)తో గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ (Varanasi)ని తెరకెక్కిస్తోన్న జక్కన్న.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారనే అంశంపై గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో భారీగా చర్చ నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)తో ప్రాజెక్ట్ ఉంటుందా? కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)తో జతకడతారా? లేక తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ను పట్టాలెక్కిస్తారా? అంటూ రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ సూర్యతో కాంబినేషన్‌పై వస్తున్న వార్తలపై రాజమౌళి తొలిసారిగా స్పందించారు. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ (Don't Trouble The Trouble). ఎస్.ఎస్. కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుదల కానున్న సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళితో పాటు సూర్య కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు సూర్యతో సినిమా ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించగా.. జక్కన్న తనదైన శైలిలో చాలా తెలివిగా, నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘‘మీ నుంచి ఈ ప్రశ్న వస్తుందని నేను ముందే ఊహించాను. అందుకే ప్రిపేర్ అయ్యే సమాధానంతో వచ్చాను. మేమిక్కడికి వచ్చింది ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాను ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు నేను, సూర్య కలిసి సినిమా చేయడం గురించి ఏదైనా మాట్లాడితే.. రేపు ఉదయం వార్తల్లో అదే మెయిన్ హెడ్‌లైన్ అయిపోతుంది. దాంతో మేము ప్రమోట్ చేయాలనుకున్న సినిమా సైడ్‌లైన్ అయిపోతుంది. కాబట్టి మేమిద్దరం కలిసి పనిచేస్తే అది కచ్చితంగా ఏదో ప్రత్యేకమైనదే అవుతుంది’’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టకుండానే దాటవేశారు.


రాజమౌళి ఇచ్చిన ఈ సమాధానంతో ప్రస్తుతం ఆయన దృష్టంతా ‘వారణాసి’ పూర్తి చేయడంపైనే ఉందని స్పష్టమవుతోంది. అయితే సూర్యతో సినిమా రూమర్లను ఆయన పూర్తిగా కొట్టిపారేయకుండా ‘‘మేమిద్దరం కలిసి పనిచేస్తే కచ్చితంగా ఏదో ప్రత్యేకమైనదే అవుతుంది’’ అని చెప్పడం గమనార్హం. దీంతో వీరిద్దరి కాంబో భవిష్యత్తులో ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని, సరైన సమయంలోనే జక్కన్న దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రోమియో జూలియట్.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్.. ప్రభాస్ సపోర్ట్

ఆ మాత్రం దానికి.. హీరోయిన్ ఎందుకు? హీరోయిన్ల పాత్రలపై కంప్లయింట్స్

‘వారణాసి’ ఈవెంట్ టెన్షన్‌.. ఏడుపొచ్చేసింది: కార్తికేయ

Updated Date - Sep 28 , 2026 | 08:15 AM