అప్పుడు అక్కాతమ్ముళ్ళుగా... ఇప్పుడు వైరి వర్గాలుగా!
ABN, Publish Date - Oct 22 , 2026 | 08:59 AM
ఈ దీపావళికి టాలీవుడ్లో అనువాద చిత్రాల సందడి నెలకొననుంది. నవంబర్ 5న ‘రామాయణ’, నవంబర్ 6న ‘మహాశక్తి’, ‘సీన్’, ‘నాన్న కుట్టి’ చిత్రాలు తెలుగులో విడుదల కానున్నాయి. స్ట్రయిట్ తెలుగు సినిమాగా కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘హతః’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈసారి టాలీవుడ్ లో దీపావళి సందడి అంతా అనువాద చిత్రాలదే అనుకోవాలి! ఎందుకంటే నవంబర్ 5న హిందీలో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ' వివిధ భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. సాయిపల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటించిన ఈ సినిమాలో యశ్ రావణాసుడిగా నటించాడు. అంతేకాదు... ఆయన ఆ సినిమా నిర్మాణ భాగస్వామి కూడా.
చిత్రం ఏమంటే ఇటీవల వచ్చిన 'టాక్సిక్'లో యశ్ కు సోదరిగా నటించిన నయనతార నటించిన 'మహాశక్తి' తమిళ అనువాద చిత్రం కూడా ఇదే పండగకు వస్తోంది. కాకపోతే ఒక రోజు తర్వాత! సుందర్ సి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నయనతారతో పాటు రెజీనా కసాండ్రా, దునియా విజయ్, యోగిబాబు, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'రామాయణ' చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తుంటే... 'మహాశక్తి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమా నవంబర్ 6న విడుదల అవుతోంది.
'రామాయణ, మహాశక్తి' అనువాద చిత్రాలతో పాటు సూర్య నటించిన తమిళ చిత్రం 'సీన్' కూడా దీపావళికే వస్తోంది. ఈ సినిమా నవంబర్ 6న విడుదల అవుతోంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన 'సీన్'లో నజ్రియా నజీమ్ హీరోయిన్. ఈ యాక్షన్ కామెడీ మూవీని సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక అదే రోజున విజయ్ ఆంటోని తమిళ మూవీ 'నాన్న కుట్టి' సైతం తెలుగులో విడుదల కాబోతోంది. ఈ రకంగా ఒక హిందీ డబ్బింగ్ సినిమాతో పాటు మూడు తమిళ అనువాద చిత్రాలు దీపావళి కానుకగా తెలుగులో వస్తున్నాయి. అయితే ఇప్పటికి తెలుగులో దీపావళికి వస్తున్న స్ట్రయిట్ మూవీ కిరణ్ అబ్బవరం నిర్మించిన 'హతః' మాత్రమే! రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత ఎంవీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనుష్ గోరక్ డైరెక్టర్. మరి రాబోయే రోజుల్లో ఇంకేమైనా సినిమాను ఈ పండగకు వస్తాయేమో చూడాలి!
ఇవి కూడా చదవండి:
రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. ‘RC17’ స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్
నవ్వుల రాబరీ మొదలైంది.. హిలేరియస్‌గా ‘దొంగ నా కొడుకు’ టీజర్
తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది