సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దీపావళి బరిలో డబ్బింగ్ సినిమాల హవా.. ఒక్కటే స్ట్రయిట్ తెలుగు మూవీ!

ABN, Publish Date - Nov 04 , 2026 | 03:40 PM

ఈ ఏడాది దీపావళి సీజన్‌లో మూడు భారీ అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. స్ట్రయిట్ తెలుగు సినిమాగా 'సమ్మర్ హాలిడేస్' ఒక్కటే విడుదలవుతోంది.

Dubbing Deepavali movies

గత యేడాది దీపావళికి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు విడుదల కాకపోయినా, 'కె-ర్యాంప్‌', 'తెలుసు కదా', 'మిత్రమండలి' వంటి స్ట్రయిట్‌ చిత్రాలతో పాటు తమిళ అనువాద చిత్రం 'డ్యూడ్‌' విడుదలైంది. ఇందులో 'డ్యూడ్‌', 'కె-ర్యాంప్‌' మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. కానీ ఈసారి దీపావళి సీజన్ లో డబ్బింగ్‌ సినిమాలదే హవా! దీపావళి పండగ నవంబర్‌ 8వ తేదీ కాగా మూడు రోజుల ముందే గురువారం హిందీ అనువాద చిత్రం 'రామాయణం' వస్తోంది. భారతదేశంలోని వివిధ ప్రధాన భాషల్లో ఈ సినిమాను అనువదించి, భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అలానే నయనతార నాయికగా సుందర్ సి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మహాశక్తి' చిత్రం తెలుగులో రాబోతోంది. తమిళంలో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగానికి ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహించగా, ఈ సీక్వెల్ ను సుందర్ సి రూపొందించారు.


తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. 'కరుప్పు' సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇది తెలుగులో 'వీరభద్రుడు'గా డబ్ అయ్యింది. అలానే సూర్య ఈ యేడాది నటించిన రెండో సినిమా 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్'. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్‌ను సంపాదించింది. ఇప్పుడు ఈ యేడాది ముచ్చటగా మూడో సినిమా 'సీన్' నవంబర్‌ 6న రాబోతోంది. ఇలా ఈ యేడాది దీపావళికి మూడు భారీ అనువాద చిత్రాలు విడుదల అవుతుంటే... ఒకే ఒక్క స్ట్రయిట్‌ తెలుగు సినిమాగా 'సమ్మర్ హాలిడేస్‌' వస్తోంది. నిజానికి దీపావళి పండక్కే కిరణ్‌ అబ్బవరం నిర్మించిన 'హతః' సినిమా విడుదల కావాల్సింది. కానీ దీనిని వాయిదా వేశారు. కొత్త రిలీజ్‌ డేట్ ప్రకటించాల్సి ఉంది. ఇక విజయ్‌ ఆంటోనీ నటించిన 'నాన్న కుట్టి' సినిమాను కూడా నవంబర్ 6న విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు కానీ ఆ తర్వాత దాని విడుదల తేదీని నవంబర్‌ 20కి వాయిదా వేశారు. ఏదేమైనా... ఈ యేడాది దీపావళికి డబ్బింగ్‌ సినిమాల సౌండ్‌గా ఎక్కువగా ఉండబోతోంది.

ఇవి కూడా చదవండి:

దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే

కోలీవుడ్‌లోకి పంజాబీ భామ షెర్రీ అగర్వాల్.. తొలి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు


Updated Date - Nov 04 , 2026 | 03:46 PM