పవన్ కళ్యాణ్‌ని బాబీ కలిసింది అందుకేనా?
ABN , Publish Date - Apr 10 , 2026 | 08:12 PM
ఇటీవలే బాబీ, పవన్ కళ్యాణ్‌ను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, వీరిద్దరూ సినిమా చేస్తున్నారని అందరూ భావించారు. కానీ అసలు విషయం మాత్రం అది కాదు. పవన్ కళ్యాణ్‌ని బాబీ కలవడానికి కారణం వేరే ఉంది. ఆ విషయం తెలిస్తే అంతా హ్యాపీ అవుతారు.
‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో మంచి విజయం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ డైరెక్టర్ బాబీ (Director Bobby).. మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. చిరంజీవిని బాబీ వింటేజ్ లుక్‌లో చూపిస్తూనే, అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్‌ను పక్కాగా ప్లాన్ చేయడంలో దిట్ట. దీంతో వీరిద్దరి కలయికలో రాబోతున్న తదుపరి చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుండటంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.
ఇటీవలే బాబీ, పవన్ కళ్యాణ్‌ను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, వీరిద్దరూ సినిమా చేస్తున్నారని అందరూ భావించారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. చిరంజీవి సినిమా ఓపెనింగ్‌కు పవన్‌ను ఆహ్వానించడానికే బాబీ వెళ్లినట్లు తాజా సమాచారం. ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను చూడటం అభిమానులకు కన్నుల పండుగగా ఉండనుంది. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి, ప్రస్తుతం ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంతో పాటు, ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా ఒక ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. వీటితో పాటు బాబీ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్తుండటంతో మెగాస్టార్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే, పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ‘ఓజీ 2’ సీక్వెల్స్‌తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాలలో ఏది ముందుగా సెట్‌పైకి వెళుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల అప్‌డేట్స్ కోసం అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు, చిరు-బాబీ మూవీ పూజా కార్యక్రమం కూడా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ
‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్
నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!
గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!
సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు