సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రణ్‌బీర్‌ కపూర్‌ వల్లే ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ మారిందా

ABN, Publish Date - Oct 24 , 2026 | 06:28 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). ప్రస్తుతం ఈ సినిమా విడుదలపై చర్చ నడుస్తోంది.


ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్‌’ (Spirit). ప్రస్తుతం ఈ సినిమా విడుదలపై చర్చ నడుస్తోంది. తొలుత ఈ సినిమాను 2027 మార్చిలో విడుదల చేయాలని  ప్లాన్‌ చేశారు. తాజాగా విడుదల తేదీలో మార్పు చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు  తీసుకురానున్నారు. దీపావళి పండుగకు దగ్గరగా ఉండటంతో సినిమాకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కొత్త విడుదల తేదీ వెనుక మరో ఆసక్తికరమైన విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న ‘రామాయణం 2’ విడుదల వాయిదా పడే అవకాశం ఉందన్న సమాచారం సందీప్‌ రెడ్డి వంగాకు ముందుగానే తెలిసిందని, అందుకే ‘స్పిరిట్‌’ చిత్రాన్ని దీపావళి సీజన్‌లో విడుదల చేయడానికి సిద్థమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

గతంలో ‘రామాయణం 2’, ‘స్పిరిట్‌’ చిత్రాలు ఒకే పండుగ సీజన్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయని టాక్‌ నడిచింది. అదే జరిగితే బాక్సాఫీస్‌ వద్ద రెండు భారీ చిత్రాల మధ్య పోటీ నెలకొనే పరిస్థితి ఉండేది. అయితే, ‘రామాయణం 2’ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే వార్తల నేపథ్యంలో ‘స్పిరిట్‌’ చిత్రానికి దీపావళి సీజన్‌ కలిసివచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడి వంగాకు మఈ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన యానిమల్‌ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ పరిచయం కారణంగానే ‘రామాయణం 2’ విడుదలకు సంబంధించిన సమాచారం సందీప్‌కు ముందుగానే తెలిసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. 

 

ALSO READ:
Ramayana: ‘రామాయణ’తో భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త ప్రయోగం..

ఇట్లు అర్జున.. మరోసారి వాయిదా

కాంత బర్త్ డే సెలబ్రేట్ చేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్


Updated Date - Oct 24 , 2026 | 07:27 PM