ఇట్లు అర్జున.. మరోసారి వాయిదా

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:57 PM

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అనీష్ (Aniesh) హీరోగా, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు అర్జున (Itlu Arjuna).

Itlu Arjuna

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అనీష్ (Aniesh) హీరోగా, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు అర్జున (Itlu Arjuna). నూతన దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ నిర్మించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున సమర్పిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా అక్టోబర్ 30 న రిలీజ్ కానుంది.


ఇక అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 30 న కూడా ఇట్లు అర్జున రావడం లేదని తెలుస్తోంది. . సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్, ప్యాచ్ వర్క్ కోసం మరింత సమయం పట్టడం వలనే ఈ జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. సినిమా అవుట్‌పుట్‌లో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకోపక్క అదే రోజున ఆదర్శ కుటుంబం కూడా అదే రోజు రావడంతో పెద్ద సినిమాతో పోటీ ఎందుకు అని వెనక్కి తగ్గి ఉండవచ్చు అని టాక్ నడుస్తోంది.


అన్ని అనుకూలిస్తే నవంబర్ 13న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లాంగ్ వీకెండ్ లేదా పండుగ సీజన్ కాకపోయినా, కథ, కంటెంట్ మీద ఉన్న బలమైన నమ్మకంతోనే మేకర్స్ ఈ తేదీని లాక్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా సినిమా కొద్దిగా ఆలస్యం అవుతున్నప్పటికీ, మంచి సినిమా కరెక్ట్ టైమ్ కి రావడం బెటర్ అని చెప్పవచ్చు. త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 24 , 2026 | 06:08 PM