కాంత బర్త్ డే సెలబ్రేట్ చేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:01 PM

టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలలో ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ హిట్ జైలర్ 2 (Jailer 2) గురించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

Jailer 2

టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలలో ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ హిట్ జైలర్ 2 (Jailer 2) గురించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా టైగర్ ముత్తువేల్ పాండియన్ తన సత్తా చూపించాడు. ఇప్పటికీ థియేటర్ లో విజయవంతంగా రన్ అవుతోన్న జైలర్ 2 చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన బిహైండ్-ది-సీన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


బిందాస్ సాంగ్ సెట్ లో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో విద్యా కేక్ కట్ చేసి.. రజనీకి తినిపించి.. మేము కపుల్ కాదు అని చెప్పుకొచ్చింది. సినిమాలో కాంతని టైగర్ ముత్తువేల్ పాండియన్ ఏ రేంజ్ లో ఫ్లర్ట్ చేశాడో అందరికీ తెలుసు. అందుకే ఆమె మేము కపుల్ కాదు అని చెప్పి నవ్వేసింది. ఇక ఈ వీడియో చూశాక నెటిజన్స్.. కాంత బర్త్ డే ని టైగర్ ముత్తువేల్ పాండియన్ సెలబ్రేట్ చేస్తున్నాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.


ఇక ఈ వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, డైరెక్టర్ నెల్సన్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రముఖ కమెడియన్ సంతానం కనిపించడం గమనార్హం. దీంతో ఈ చిత్రంలో ఆయన కూడా నటించాడనే వార్తలు నిజమే అని తెలుస్తోంది. కల్పక్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన పార్టీలో ముత్తువేల్ పాండియన్ ప్లాన్ చేసిన ఒక హైస్ట్-స్టైల్ కామెడీ ట్రాక్‌లో సంతానం పార్టీ ప్లానర్‌గా నటించారని సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన దాదాపు 10 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, రన్‌టైమ్ రీత్యా ఆ ఫుటేజ్‌ను సినిమా నుండి కట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కామెడీ సీన్లతో పాటు మోహన్‌లాల్‌కు సంబంధించిన మరిన్ని అదనపు క్షణాలతో త్వరలోనే ఓటీటీలో ఒక అన్‌కట్ వెర్షన్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 04:12 PM