Ramayana: ‘రామాయణ’తో భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త ప్రయోగం..

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:35 PM

భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సాంకేతిక ప్రయోగాలకు తెరతీస్తూ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘రామాయణ’ చిత్రం.

భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సాంకేతిక ప్రయోగాలకు తెరతీస్తూ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది ‘రామాయణ’ (Ramayana) చిత్రం. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితర  నటీనటులు భాగమైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే.. ‘బ్రహ్మ’ ఏఐ టెక్నాలజీ! (Brahma AI Technology)

ఈ చిత్రాన్ని ప్రధానంగా హిందీ భాషలో చిత్రీకరించినప్పటికీ, విడుదలైన ట్రైలర్‌లో నటీనటుల పెదవుల కదలికలు వివిధ భాషలకు అనుగుణంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  ట్రైలర్లో గమనిస్తే  నటీనటులు ఆయా భాషల్లోనే నేరుగా డైలాగులు చెప్పినట్టుగా అనిపిస్తోంది. దీంతో ఈ స్థాయిలో లిప్ సింక్‌ను ఎలా సాధించారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సాంకేతికత వెనుక ‘బ్రహ్మ’ ఏఐలోని VAANI Engine కీలక పాత్ర పోషించినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా   వెల్లడించారు. ఈ టెక్నాలజీ సాయంతో నటీనటుల పెదవుల కదలికలను ఆయా భాషల్లోని సంభాషణలకు అనుగుణంగా మార్చి, వారు ఆ భాషలోనే మాట్లాడుతున్నట్టుగా సహజమైన అనుభూతిని కలిగించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.  అయితే ఈ ప్రక్రియలో కేవలం ఏఐపైనే ఆధారపడకుండా, వివిధ భాషల్లో నైపుణ్యం ఉన్న భాషా నిపుణులు, డబ్బింగ్ కళాకారుల సహకారం కూడా తీసుకున్నట్లు , ముందుగా ఆయా భాషల్లో సంభాషణలను సిద్ధం చేసి, ఆ తర్వాత సాంకేతికత సాయంతో నటీనటుల పెదవుల కదలికలకు సరిపోయేలా రూపొందించినట్లు మేకర్స్  చెప్పారు.

Updated Date - Oct 24 , 2026 | 04:53 PM