సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దాదా.. బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

ABN, Publish Date - Sep 28 , 2026 | 10:50 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ, అంతకంటే రెట్టింపు స్పీడ్‌తో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. తాజాగా ఆయన సినిమా ‘దాదా’కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

Balayya Dada Update

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ, అంతకంటే రెట్టింపు స్పీడ్‌తో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ (Veerasimha Reddy) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన ‘దాదా’ (Dada) సినిమా చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌కు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఇస్తున్న మాస్ వైబ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, యంగ్ హీరో మంచు మనోజ్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో అలరించబోతున్నారు.


అయితే.. జూన్‌లో ఈ సినిమాలోని ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా బాలయ్యకి గాయమైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరగగా, వైద్యుల సలహా మేరకు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలకృష్ణ పూర్తిగా కోలుకున్నారని, మళ్ళీ మునుపటి జోష్‌తో సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం.. ‘దాదా’ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 29 నుంచి మైసూర్‌లో ప్రారంభం కానుందట. ముందుగా ఇతర కీలక నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించేందుకు డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్‌లో నటసింహం స్వయంగా ఈ మైసూర్ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నారట. బాలయ్య సెట్స్‌లోకి అడుగుపెట్టగానే ఆయనపై కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ అండ్ డ్రామా ఎపిసోడ్స్‌ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ షెడ్యూల్‌తో పెండింగ్ ఉన్న ప్రధాన సన్నివేశాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగాన్ని పెంచాలని టీమ్ భావిస్తోంది.


అయితే, అభిమానులకు వేధిస్తున్న ఓ ముఖ్యమైన ప్రశ్న.. ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా?. దాదాను డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని ముహూర్తం ఖరారు చేశారు. కానీ బాలయ్య షూటింగ్‌లో పాల్గొనడంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, డిసెంబర్ 24 రిలీజ్ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతిలో కేవలం పరిమిత సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది రోజుల్లోనే పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలి, కొంత వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్, డబ్బింగ్ పనులు ముగించాలి. దాంతో పాటు ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు పండుగ సీజన్ సంక్రాంతికి వెళ్దామంటే.. అక్కడ ఇప్పటికే భారీ పోటీ నెలకొంది. అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ ఒత్తిడిని పక్కన పెట్టి, ముందుగా సినిమా చిత్రీకరణను సాఫీగా పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టారట. మరి ఈ ప్రతిబంధకాలను దాటుకుని నందమూరి బాలకృష్ణ అనుకున్నట్లుగానే డిసెంబర్ 24న ‘దాదా’గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మాస్ తాండవం చేస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

150 కోట్ల క్లబ్‌లోకి ‘ద ప్యారడైజ్’.. అసలు పరీక్ష స్టార్ట్

అప్పుడు వెంకీకి నేనెవరో తెలియదు: త్రివిక్రమ్

సోషల్ మీడియా వేదికగా పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు

Updated Date - Sep 28 , 2026 | 10:50 AM