సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వరంగల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారక్క’ పేరు పెట్టండి.. సీఎం పిలుపుకు దర్శకుడి స్పందన

ABN, Publish Date - Sep 20 , 2026 | 04:51 PM

వరంగల్ విమానాశ్రయానికి పేరు సూచించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన‌ పిలుపు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

Revanth Reddy

వరంగల్ విమానాశ్రయానికి (Warangal Airport) పేరు సూచించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన‌ పిలుపు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సినీ పరిశ్రమ నుంచి వచ్చిన స్పందనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) వంటి ప‌లువురు దిగ్గ‌జ‌ సినీ సెల‌బ్రిటీలు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వరంగల్ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించారు.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వరంగల్ గొప్ప వారసత్వానికి గుర్తుగా "రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Rudrama International Airport) లేదా "కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Kakatiya International Airport) అనే పేర్లను పరిశీలించాలని సూచించారు. కాకతీయుల చరిత్రకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో అలాంటి పేరు ప్రాంత గౌరవాన్ని మరింత పెంచుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా రాణి రుద్రమదేవి పేరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని నెటిజన్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకలైన సమ్మక్క-సారక్కల పేరును ప్రతిపాదించారు. "సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Sammakka Sarakka Airport) అని పేరు పెడితే అది వీర మహిళలకు ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు కూడా మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ మూడు పేర్లపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. వరంగల్‌కు చారిత్రక గుర్తింపునిచ్చే పేరు కావాలా? లేక తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన పేరు కావాలా? అనే అంశంపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 05:27 PM