సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి.. ‘ఇరుముడి’పై చిరు పోస్ట్ వైరల్

ABN, Publish Date - Aug 27 , 2026 | 01:50 PM

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమాపై ఆసక్తికరంగా స్పందించారు.

Chiru on Irumudi

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ఇరుముడి’ (Irumudi) బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా విజయంపై అభినందనలు తెలపగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్వయంగా సినిమాను వీక్షించి పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రవితేజ అద్భుత నటనను, దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగాల మేళవింపును, బేబీ నక్షత్ర ప్రతిభను, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ను మనస్ఫూర్తిగా అభినందించిన చిరంజీవి.. పోస్ట్ చివర్లో రాసిన పదునైన వాక్యాలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


‘‘ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి! LiveAndLetLive’’ అంటూ చిరంజీవి ముగించిన తీరు సాధారణ అభినందనల పరిధిని దాటి, ఇండస్ట్రీలోని ఏకఛత్రాధిపత్య ధోరణులకు చెంపపెట్టులా తగిలింది. థియేటర్ల మాఫియా, గుత్తాధిపత్యంతో చిన్న, మధ్య తరహా హిట్ సినిమాలను సైడ్ చేసేయాలని చూసే స్వార్థ శక్తులకు మెగాస్టార్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇదని విశ్లేషకులు భావిస్తున్నారు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న మంచి సినిమాను బలవంతంగా తప్పించి, ఇతర చిత్రాలకు అనుకూలంగా చక్రం తిప్పాలని చూసే వారికి కౌంటర్ ఇచ్చేలా మెగాస్టార్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారనేలా.. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమానైనా నెత్తిన పెట్టుకుంటారనే దానికి ‘ఇరుముడి’ నిదర్శనమని, ఒకరి ఎదుగుదలను తొక్కిపెట్టే కుసంస్కారానికి పరిశ్రమలో తావులేదని చిరు తన పోస్ట్ ద్వారా తేల్చిచెప్పారు. ‘బ్రతుకు - బ్రతికించు’ అనే మెగాస్టార్ నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి సినీ ప్రియుల నుంచి విశేష మద్దతును కూడగట్టుకుంటోంది. కేవలం అభినందనలతో సరిపెట్టకుండా, పరిశ్రమ ఉమ్మడి క్షేమం కోసం చిరంజీవి చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని తెరవెనుక రాజకీయాలకు పర్ఫెక్ట్ కౌంటర్‌గా నిలిచాయని చెప్పుకోవచ్చు. పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఇలా అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ ఉంటేనే.. కొందరు హద్దుల్లో ఉంటారనేలా అభిమానులు కూడా ఈ ట్వీట్‌కు మద్దతు తెలుపుతుండటం విశేషం. ఇక చిరు చేసిన ఈ పోస్ట్‌కు రవితేజ కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘అన్నయ్యా.. థ్యాంక్యూ సో మచ్’’ అంటూ రవితేజ చిరు ట్వీట్‌కు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

GV Narayanarao: నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత.. 

Toxic: అయ్యో.. రుక్మిణి వసంత్‌ని అలా వాడేశారేంట్రా

నా భర్త నా కోరిక తీర్చేశారు: నటి పూర్ణ భావోద్వేగం

Updated Date - Aug 27 , 2026 | 02:18 PM