Toxic: అయ్యో.. రుక్మిణి వసంత్‌ని అలా వాడేశారేంట్రా

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:43 PM

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్‌‌కు ‘టాక్సిక్’లో దక్కిన పాత్రపై అంతా ఆశ్చర్యపోతున్నారు.

Rukmini Vasanth In Toxic

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth)కు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహజసిద్ధమైన అందం, అద్భుతమైన అభినయంతో అనతికాలంలోనే సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (Dragon)లో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సుకుమార్ - రామ్ చరణ్ కాంబో మూవీ ‘RC17’ కోసం కూడా ఆమె పేరు పరిశీలనలో ఉంది. ఇలా టాలీవుడ్, శాండల్‌వుడ్‌లోని అగ్ర హీరోలందరి కన్ను ఇప్పుడు రుక్మిణిపైనే ఉంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న ఇలాంటి గోల్డెన్ టైమ్‌లో, రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ (Toxic)లో ఆమె పాత్రను చూసి సినీ ప్రియులు, అభిమానులు షాక్‌కి గురవుతున్నారు.


భారీ అంచనాల నడుమ విడుదలైన ‘టాక్సిక్’ చిత్రంలో రుక్మిణి వసంత్ పోషించిన క్యారెక్టర్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ అసలు ఈ పాత్రను ఎలా ఒప్పుకుందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఆమె పాత్రకు కనీస ప్రాధాన్యత లేకపోగా, ఉన్న కాసేపు కూడా అసభ్యకరంగా వ్యాంపు తరహాలో డిజైన్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తండ్రి అప్పు ఉన్నాడని హీరోయిన్ అంత పెద్ద డాన్ వద్దకు సూసైడ్ బాంబర్ లా రావడం ఏంటో? అది చూసి ఎలాగో పోయే వాళ్లం ఒకరిపై ఒకరం ఎక్కుడు దిగుడు పని కానిచ్చుకుని చూద్దాం.. ఎందుకు అంత అందం వేస్ట్ చేసుకోవడం.. వంటి డైలాగ్స్ ఎందుకు అస్సలు అర్థం కావు. ఆ సీన్ అలా అవగానే అప్పు తీర్చినందుకు థాంక్స్ అంటూ మరలా ఎంట్రీ ఇచ్చి.. నేను ఇక్కడే ఉండి పోవచ్చా అని ఆ ముసలి డాన్‌కు ఇకపై నేనే పర్మినెంట్ అని చెప్పి.. అతనితోనే గడిపి.. కొడుకుని కనడం అన్నీ చూసే వారికి ఎబ్బెట్టు గా అనిపించక మానదు. తీరా ఇంత చేస్తే రెండు మూడు నిమిషాల స్క్రీన్ స్పేస్ మించి రుక్మిణి పాత్రకు ప్రయారిటీ లభించలేదు.

డైరెక్ట‌ర్ గీతూ, హీరో యశ్ ఇద్దరు కలిసి స్టోరీ, డైలాగులు అందించగా రుక్మిణి పాత్ర అలా ఎలా రాశారు, రుక్మిణి సైతం ఎలా ఒప్పుకుందంటూ ఆమెను ఆరాదించే వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి పాత్ర చేయాలా, ఆ మాత్రం పాత్ర చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆమె స్థాయికి ఏమాత్రం తగని రీతిలో ఆ పాత్రను తెరపై ప్రెజెంట్ చేశారని, ఈ దెబ్బతో ఆమె కెరీర్ కు ఇబ్బందులు తప్పవని అభిమానులు వాపోతున్నారు. ‘అయ్యో.. రుక్మిణిని ఇలా వాడేశారేంటి?’ అంటూ నెట్టింట ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవడం ఆమె కెరీర్‌కు పెద్ద మైనస్‌గా మారే ప్రమాదముందని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. సరైన కథలు, పాత్రల ఎంపికలో కాస్త నిర్లక్ష్యం వహించినా పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టమవుతుందనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు మంచి విజయాలు సాధిస్తే ఈ నెగిటివిటీ నుంచి ఆమె సులువుగానే బయటపడే అవకాశముంది. మరి ‘టాక్సిక్’తో వచ్చిన ఈ ఊహించని విమర్శలను, డ్రాబ్యాక్‌ను రుక్మిణి వసంత్ తన రాబోయే సినిమాలతో ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

వి.ఎన్. ఆదిత్య క్లాప్‌తో.. సరికొత్త యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ప్రారంభం

నా భర్త నా కోరిక తీర్చేశారు: నటి పూర్ణ భావోద్వేగం

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్

Updated Date - Aug 27 , 2026 | 02:22 PM