ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి
ABN, Publish Date - Nov 23 , 2026 | 08:03 PM
పీఎస్జే ఫిల్మ్స్ కో బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో.. సురేందర్ చాచా దర్శకత్వంలో తెరకెక్కిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
పీఎస్జే ఫిల్మ్స్ కో బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో.. సురేందర్ చాచా (Surender Chaacha) దర్శకత్వంలో తెరకెక్కిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఆలోచన’ (Alochana). సీనియర్ నటులు G.V. నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ కీలక పాత్రల్లో నటించగా.. సుజనా, అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ, ప్రసాద్ రామ్, నరేంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 27న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘ఆలోచన’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘స్నేహం కోసమే అన్నీ.. స్నేహంతోనే అన్నీ.. ఆశ, మోహం, అసూయ, స్వార్థం అన్నీ చచ్చి నీలోని మనిషి ప్రతి మనిషిని ప్రేమిస్తే చాలు.. ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు.. ఆ ప్రేమలో ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తావు.. నువ్వు తృప్తిగా మరణించడానికి మార్గం మానవత్వం.. అదే దైవం, అదే మోక్షం’’, ‘‘ప్రాణ స్నేహితులు చచ్చిపోతే.. వాడితో పాటు చచ్చిపోయే స్నేహితుడు చరిత్రలో ఉన్నాడా?’’, ‘‘అద్భుతాలను అనుభవించాలి.. ప్రశ్నించకూడదు.. సమాధానం దొరకదు.. ఉండదు’’ వంటి లోతైన, అర్థవంతమైన డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. గుండెను తాకే ఎమోషన్స్, మనసును కదిలించే సన్నివేశాలతో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించేలా ఈ ట్రైలర్ సాగింది.
ట్రైలర్ లాంఛ్ చేసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నా క్లాసిక్ చిత్రం ‘మంచు పల్లకి’ స్ఫూర్తితో ‘ఆలోచన’ సినిమా చేశామని చెప్పారు. ఈ ‘ఆలోచన’ చిత్రం నిజంగానే ఒక మంచి ఆలోచన. వృద్ధాప్యంలోనూ తల్లిదండ్రులు తమ బిడ్డల గురించే ఆలోచిస్తుంటారు. కానీ బిడ్డలకు మాత్రం వేర్వేరు ప్రపంచాలు ఉంటాయి. అలాంటి వయసులో తమ పాత స్నేహితులతో కలిసి ఉండటం, ఆలోచనలు పంచుకోవడం, సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల మళ్లీ వయసు వెనక్కి వెళ్లినట్లు వారికి అనిపిస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన ఆలోచనను రేకెత్తించేలా ఈ సినిమా ఉంది. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలని, ‘ఆలోచన’ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో సినిమా యూనిట్‌కు చెందిన పలువురు సినీ నటులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు
ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు
లైన్లోకి వచ్చిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రిలీజ్ ఎప్పుడంటే