సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నేను పొందిన పిత్రోత్సాహం.. వారు కూడా పొందాలి కదా: చిరంజీవి

ABN, Publish Date - Jul 23 , 2026 | 10:31 AM

‘చెన్నై లవ్ స్టోరీ’ టైటిల్ వినగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం, ప్రేమ గుర్తుకువచ్చాయని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Chiranjeevi at Chennai Love Story Pre Release Event

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా.. ‘కలర్ ఫొటో, బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘చెన్నై లవ్ స్టోరీ’ టైటిల్ వినగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం, ప్రేమ గుర్తుకువచ్చాయి. చెన్నైలో లవ్ స్టోరీ కాదు.. చెన్నైతో నాకున్న ప్రేమ గుర్తుకు వచ్చింది. ఆ రోజుల్లో చెన్నై నగరానికి వెళ్లినప్పుడు, అక్కడి స్టూడియోలు చూసినప్పుడు.. ఇక్కడ కదా మన ఆశలు నెరవేరేది అనిపించేది. ఈ స్టూడియోల్లోనే కదా మనం నటుడిగా పేరు తెచ్చుకుని నిలదొక్కుకోవాలి అనే ఆశ కలిగేది. అదే చెన్నై రోడ్ల మీద అవకాశాల కోసం ఎంతగానో తిరిగాం. అదే రోడ్ల మీద స్టార్స్ స్టేటస్‌లో కార్లలో తిరిగాం. ఆ రోజులన్నీ చెన్నై లవ్ స్టోరీ టైటిల్ అనగానే మదిలో మెదిలాయి. ఈ టైటిల్‌లో ఆ మ్యాజిక్ ఉంది.


యంగ్ స్టర్స్ చేస్తున్న సినిమా ఇది. నా అభిమానులు చేసిన సినిమా కాబట్టి ఈ ఈవెంట్‌కు వచ్చాను. ఎస్కేఎన్, సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం, మణిశర్మ.. ఇలా వీళ్లంతా నా మీద పెంచుకున్న అభిమానం, ప్రేమ నన్ను ఈ వేదిక మీద నిలబడేలా చేశాయి. నా అభిమానులను ఇష్టపడతాను. నా అభిమానులు ఎదిగితే ప్రాణప్రదంగా చూసుకుంటాను. నన్ను అభిమానించడమే కాదు.. వారు ప్రయోజకులై, మీ కుటుంబానికి, సమాజానికి పేరు తీసుకొచ్చి, అందరూ గర్వపడేలా చేస్తే అదే నాకు నిజమైన సంతోషం. అదే నాపై మీరు చూపించే నిజమైన ప్రేమగా భావిస్తాను. అలాంటి అభిమానులను చూసి ముచ్చటపడుతుంటాను. ఈ వేదిక మీద అలాంటి అభిమానులను చూసి ఆనందానికి లోనవుతున్నాను. ఏదో పిలిచారు కదా అని ఈవెంట్‌కు వచ్చి విశెస్ అందించి వెళ్లిపోవడం కాదు.. మీ అభిమానం తాలుకా వైబ్రేషన్ అనుభవించాలని, మనస్ఫూర్తిగా ఈ టీమ్‌ను ప్రోత్సహించాలని వచ్చాను.

నా అభిమాని ఎస్కేఎన్ జర్నలిస్ట్, పీఆర్ఓ గా ఉంటూ నిర్మాతగా ఎదిగి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించడం నాకు సంతోషకరం. అలాగే సాయి రాజేష్ తన రచన ప్రతిభతో, దర్శకత్వ ప్రతిభతో విజయాలు సాధిస్తున్నాడు. ఎస్కేఎన్‌తో కలిసి మంచి మూవీస్ నిర్మిస్తున్నాడు. సాయి రాజేష్ రెండు నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానుల్లో తలమాణికంలా నిలిచాడు. వీళ్లందరినీ చూసి నేను గర్వపడుతున్నాను. రవి నంబూరి నా గురించి బాగా మాట్లాడాడు. వీళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అసాధారణ కలలు కన్నారు. అదే వీళ్లను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరు కలలు కనండి, వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి తప్పకుండా విజయం సాధిస్తారు. నేనే అందుకు ఉహాదారణ. కంఫర్ట్ జోన్ వదిలేయండి.. కష్టానికి ఎదురెళ్లాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇటీవల ఎలా అయితే పిత్రోత్సాహం పొందానో.. అలాగే నా అభిమానుల తల్లిదండ్రులు కూడా ఆ అనుభూతిని పొందాలి.. వారు గర్వపడేలా చేయాలని కోరుతున్నాను. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి మహామహుల ఉన్న ఇండస్ట్రీలో నేనేం ప్రత్యేకత చూపించగలను అని ఆలోచించి అలా కష్టపడి మీ అభిమానం పొందాను.


కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. తను పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలుసు. కానీ, వాళ్ల అన్నయ్య నాకు వీరాభిమాని. థియేటర్‌లో చిరంజీవి సినిమా చూడటమే కాదు నేను అలా ఎందుకు కాకూడదు అని కిరణ్ అనుకున్నాడు.. కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తను కూడా ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నాలుగైదు మంచి హిట్స్ అందుకున్నాడు. మీ ఆదరణ పొందాడు కిరణ్. ‘చెన్నై లవ్ స్టోరీ’తో కూడా కిరణ్ మీ ప్రేమాభిమానాలు పొందుతాడు. కిరణ్ వంటి కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. శ్రీ గౌరి ప్రియ కుందనపు బొమ్మలా ఉంది. తెలుగుమ్మాయి అయినా.. తమిళ చిత్రాలతోనూ పేరు తెచ్చుకుంటోంది. అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ‘పెద్ది’ టైమ్‌లో ఆయన గురించి మాట్లాడలేకపోయాను. ఈ సినిమాకు కూడా చాలా మంచి పాటలు ఇచ్చాడని తెలిసింది. తన ఎనర్జీ చూస్తే నాకు ముచ్చటేస్తుంది. మణిశర్మ నా సోదరుడు. ఆయన కంపోజ్ చేసిన ఎన్నో మంచి పాటలకు డ్యాన్సులు చేసి మిమ్మల్ని అలరించాను. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తూ సపోర్ట్‌గా నిలుస్తోన్న మైత్రీ ప్రొడ్యూసర్స్ రవి, నవీన్‌లకు నా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఏడు నెలల పోరాటం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ‘జననాయగన్‌’ ఫీవర్‌

రామ్ చరణ్ నటన అంటే చాలా ఇష్టం: జయకృష్ణ ఘట్టమనేని

మౌనం వద్దు.. గళం విప్పండి: నటి మంచు లక్ష్మి

Updated Date - Jul 23 , 2026 | 10:31 AM