రామ్ చరణ్ నటన అంటే చాలా ఇష్టం: జయకృష్ణ ఘట్టమనేని

ABN , Publish Date - Jul 22 , 2026 | 08:22 PM

ఘట్టమనేని హీరో జయకృష్ణ ఘట్టమనేని.. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Ram Charan and Jaya Krishna Ghattamaneni

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అన్న రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన బాబాయి మహేష్ బాబు కాకుండా, ప్రస్తుత పరిశ్రమలోని ఇతర హీరోలలో ఎవరి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు జయకృష్ణ చాలా స్పష్టమైన, ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటన అంటే తనకు ఎంతో ఇష్టమని జయకృష్ణ వెల్లడించారు. ‘‘రామ్ చరణ్ కేవలం ఒక స్టార్‌గా మాత్రమే కాకుండా, ఒక పరిపూర్ణమైన నటుడిగా, పెర్ఫార్మర్‌గా నేను చూస్తాను. ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో ఆయన పెర్ఫార్మన్స్ వేరే లెవల్. కథకు ఇచ్చే గౌరవం, పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసే విధానం నాకు ఎంతగానో నచ్చాయి. నేను కూడా ఒక నటుడిగా అదే బాటలో పయనించాలని అనుకుంటున్నాను’’ అని జయకృష్ణ తన మనసులోని మాటను పంచుకున్నారు. ఇంకా ‘పెద్ది’ సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని ఆయన తెలిపారు.


స్టార్‌డమ్ అనేది ప్రేక్షకులు ఇచ్చే అభిమానాన్ని బట్టి వస్తుందని, కానీ నటుడిగా మన చేతుల్లో ఉండేది నటన మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా తన అభిమాన నటులని జయకృష్ణ తెలిపారు. ఘట్టమనేని కాంపౌండ్ నుంచి వస్తున్న మరో యంగ్ హీరోగా, నటనకే తొలి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసిన జయకృష్ణ మాటలపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతోన్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మౌనం వద్దు.. గళం విప్పండి: నటి మంచు లక్ష్మి

సేవే మా సంకల్పం: నందమూరి జానకిరామ్ భార్య దీపిక

బ్రేకింగ్ న్యూస్: ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్

Updated Date - Jul 22 , 2026 | 08:22 PM