ఆయనొక భీష్మాచార్యుడు.. ‘సింగ్ గీతం’పై చిరు పోస్ట్ వైరల్
ABN , Publish Date - Jun 11 , 2026 | 02:45 PM
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుని, విడుదలకు సిద్ధమైన చిత్రం ‘సింగ్ గీతం’. ఈ చిత్ర విడుదలను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao), క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుని, విడుదలకు సిద్ధమైన చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ రేంజ్‌లో చర్చలు నడుస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు ఈ సినిమాను సింగీతం కోసం చూస్తామంటూ.. ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ‘సింగ్ గీతం’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌తో.. ఈ సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.
‘‘శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు.. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి, వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12వ తేదీన ‘సింగ్ గీతం’ సినిమా విడుదలై, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయిగా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు గారు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్.. వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది. నాగ్ అశ్విన్‌కి, స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్.. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు..’’ అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ సినిమా టీమ్‌కు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఎలాంటి సపోర్ట్ అందించారో తెలియంది కాదు.
ఇవి కూడా చదవండి:
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!
Thank you Subbarao: పాతికేళ్ళ తర్వాత అదే టైటిల్‌తో...
Ravi Mohan: భార్యకు నెలకు రూ.40 లక్షల భరణం.. హీరో రవి మోహన్‌కు కోర్టులో చుక్కెదురు