Thank you Subbarao: పాతికేళ్ళ తర్వాత అదే టైటిల్‌తో...

ABN, Publish Date - Jun 11 , 2026 | 12:29 PM

చందు ముద్దు దర్శకత్వం వహించిన 'ధ్యాంక్యూ సుబ్బారావు' సినిమాలో చంద్రహాస్‌ కోట్ల, లావణ్య సాహుకర, రోహిత్‌ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్‌ కీలక పాత్రలు పోషించారు. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా ఈ సినిమా దినేశ్‌ కుర్ర నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీనివాసమౌళి పాటలు రాయగా, ప్రిన్స్ హెన్రీ వాటిని స్వరపరిచారు.

పాతికేళ్ళ క్రితం రియల్ స్టార్ శ్రీహరి, అభిరామి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రధారులుగా ఈవీవీ సత్యనారాయణ 'ధ్యాంక్యూ సుబ్బారావ్‌' పేరుతో ఓ వినోదాత్మక చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు అదే పేరుతో యువ దర్శకుడు చందు ముద్దు ఓ థ్రిల్లర్ మూవీని రూపొందించారు. గతంలో 'ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో' చిత్రాలను తెరకెక్కించిన చందు అదే తరహాలో చిన్నపాటి మిస్టరీతో ఈ సినిమా తీసినట్టు తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది.

ఇవి కూడా చదవండి:

Krishnam Raju: ఆరు పదుల.. రెబల్ స్టార్!

బుట్టబొమ్మకి తప్పని ‘ఐరన్ లెగ్’ శాపం..

Ravi Mohan: భార్య‌కు నెల‌కు రూ.40 ల‌క్ష‌ల భ‌ర‌ణం.. హీరో ర‌వి మోహ‌న్‌కు కోర్టులో చుక్కెదురు

Updated at - Jun 11 , 2026 | 12:31 PM