సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘చెన్నై లవ్ స్టోరీ’ సెన్సార్ పూర్తి.. విడుదలకు సిద్ధం

ABN, Publish Date - Jul 20 , 2026 | 07:58 PM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు అన్ని రకాలుగా సిద్ధమైంది.

Chennai Love Story Still

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ‘కలర్ ఫొటో, బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సాయి రాజేశ్ కథను అందించగా.. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. జూలై 24న వరల్డ్ వైడ్‌ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ మేరకు వారు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ సినిమాకు సెన్సార్ నుంచి యుబైఏ సర్టిఫికేషన్ వచ్చింది. ఇటీవల వచ్చిన ప్రేమ కథల్లో ఈ సినిమా విభిన్నంగా ఉందని, కుటుంబం అంతా చూడగలిగే ఇలాంటి మంచి ప్రేమ కథలు మరిన్ని రావాలని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. సెన్సార్ టాక్‌తో చాలా హ్యాపీగా ఉన్నట్లుగా నిర్మాతలు తెలిపారు. అంతేకాదు, మొదటి నుంచి ఊహించినట్లుగా సెన్సార్ టాక్ ఉండటంతో.. వారనుకున్నట్లుగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కాబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


మరోవైపు ఈ సినిమాకు అగ్రిసెవ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాపై ఉన్న నమ్మకంతో.. ఈ నెల 23న ప్రీమియర్స్ కూడా వేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. చూద్దాం మరి.. ఈ సినిమా కూడా ఎస్కేఎన్ అన్నట్లుగా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోతుందేమో..

ఇవి కూడా చదవండి:

అట్లీ ‘జవాన్’ కనెక్షన్.. ‘రాకా’లో తెలుగమ్మాయ్!

క్లాస్‌ మెసేజ్‌తో నటసింహం మాస్‌ విధ్వంసం..!

ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు.. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ వైరల్

Updated Date - Jul 20 , 2026 | 07:58 PM