క్లాస్‌ మెసేజ్‌తో నటసింహం మాస్‌ విధ్వంసం..!

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:03 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే అందరికీ గుర్తొచ్చేది భారీ డైలాగ్‌లు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీన్స్‌. ఇవేవీ లేకుండా సింపుల్‌ వే లో బాలయ్యను చూడడానికి అటు ఫ్యాన్స్ అయినా, ఇటు దర్శకులు అయినా పెద్దగా ఇష్టపడరు.

NBK112 New Update

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) అంటే అందరికీ గుర్తొచ్చేది భారీ డైలాగ్‌లు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీన్స్‌. ఇవేవీ లేకుండా సింపుల్‌ వే లో బాలయ్యను చూడడానికి అటు ఫ్యాన్స్ అయినా, ఇటు దర్శకులు అయినా పెద్దగా ఇష్టపడరు. వీలైనంత వరకు బాలయ్యతో సినిమా అంటే మాస్‌ పల్స్‌ బ్రేక్‌ అవ్వాల్సిందే. ‘అఖండ’ (Akhanda) సినిమా నుంచి కాస్త పంథా మార్చినా, యాక్షన్‌ సీన్స్‌‌లో మాత్రం లెక్కలు ఛేంజ్‌ కాలేదు. అలాంటి నయా మాస్ గాడ్‌తో టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా (NBK112) చేస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


టాలీవుడ్‌లో కొరటాల శివ (Koratala Siva) రూటే సెపరేట్. ‘మిర్చి’ (Mirchi) సినిమా నుంచి రీసెంట్ ‘దేవర’ (Devera) వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఒక స్ట్రాంగ్ సోషల్‌ మెసేజ్‌ ఉంటుంది. సమాజానికి పనికొచ్చే పాయింట్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో జోడించి చెప్పడం కొరటాల స్పెషాలిటీ. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఆయన ఇదే రూటును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక పవర్‌ఫుల్ సామాజిక అంశానికి బాలయ్య మాస్ ఇమేజ్‌ను తోడు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. అయితే ఈసారి కొరటాల శివ మునుపటి కంటే చాలా జాగ్రత్తగా, పక్కాగా అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. గతంలో వచ్చిన ‘ఆచార్య’, ఆ తర్వాత వచ్చిన ‘దేవర’ సినిమాల సమయంలో కొరటాల శివ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కథనం, సెకండాఫ్ విషయంలో వచ్చిన కామెంట్స్ ఆయనను అలర్ట్ చేశాయి. ఈసారి బాలయ్య సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు అస్సలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ప్రతి సీన్‌ను ఎంతో చెక్కుతూ పకడ్బందీగా స్క్రీన్‌ప్లే డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రణాళికలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఆగష్టు చివరి వారం నుంచి ఒక భారీ లాంగ్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. సుమారు 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో బాలయ్య పై కొన్ని కీలకమైన, పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సీన్స్‌ ను తెరకెక్కించనున్నారట.


కొరటాల శివ సినిమాలలో కేవలం కథ, మాటలు మాత్రమే కాదు.. యాక్షన్‌ సీన్స్‌‌కు కూడా ఒక సెపరేట్‌ స్టైల్ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసేలా ఆ ఫైట్స్ ఉంటాయి. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌ సీక్వెన్సులను ప్లాన్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ తన క్లాస్‌ పంథాను అస్సలు వదులుకోకుండానే.. బాలయ్యకు ఉన్న అపరిమితమైన మాస్‌ ఇమేజ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలన్స్‌ చేస్తూ ఈ సినిమాను అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారనేలా టాక్ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇటు క్లాస్ మెసేజ్.. అటు బాలయ్య మాస్ విధ్వంసం రెండూ ఈ సినిమాలో సమానంగా ఉండబోతున్నాయని అనుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలని కొరటాల పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. వేసవి సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకునేలా మేకర్స్ షెడ్యూల్స్ డిజైన్ చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం ‘కార్పెంటర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. టైటిల్ వినడానికి కాస్త డిఫరెంట్‌గా ఉన్నా.. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు, ఇందులో ఆయన చేసే క్యారెక్టర్‌కు పక్కాగా సూట్ అవుతుందని అంటున్నారు.


యువ సుధా ఆర్ట్స్‌, ఎస్‌ఎల్‌‌వీ సినిమాస్‌ బ్యానర్స్‌ పై సుధాకర్‌ మిక్కిలినేని, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. ‘దేవర’ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచిన అనిరుధ్.. ఇప్పుడు బాలయ్య సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను ఎలా ఊపేస్తాడో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. క్లాస్ మెసేజ్‌తో బాలయ్య చేయబోయే ఈ మాస్ విధ్వంసం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

10 డేస్ ‘లెనిన్’ కలెక్షన్స్.. సెంచరీ కష్టమేనా

ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు.. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ వైరల్

మెగా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటున్నా: నిహారిక

Updated Date - Jul 20 , 2026 | 06:03 PM