అట్లీ ‘జవాన్’ కనెక్షన్.. ‘రాకా’లో తెలుగమ్మాయ్!

ABN , Publish Date - Jul 20 , 2026 | 07:22 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’. ఈ సినిమాలో తెలుగు అమ్మాయికి అట్లీ మరో ఛాన్స్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది.

Siri Hanumanthu in Raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీ (Atlee) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే భారతీయ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న విషయం తెలియంది కాదు. అలాగే ఈ సినిమాకు సంబంధించి రోజుకో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ మోస్ట్ ఏవైటెడ్ ప్రాజెక్ట్‌లో తెలుగు నటి, బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంతు (Siri Hanumanthu) కీలక పాత్రను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఈ విషయాన్ని అధికారికంగా బయటపెట్టడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘సీతా పయనం, చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాల తర్వాత సిరి హనుమంతుకు ఇది కెరీర్‌లోనే అతిపెద్ద ఆఫర్ అని చెప్పవచ్చు.


అయితే అల్లు అర్జున్ ‘రాకా’లో సిరికి అవకాశం రావడం వెనుక దర్శకుడు అట్లీతో ఉన్న పాత ‘జవాన్’ కనెక్షనే కారణమని టాలీవుడ్‌లో గట్టిగా టాక్ నడుస్తోంది. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘జవాన్’ చిత్రంలో సిరి హనుమంతు ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ పరిచయం, ఆమె నటన నచ్చడంతోనే అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్‌తో నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ ఆమెకు మరో మంచి రోల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ‘రాకా’లో ఆమె ఎలాంటి క్యారెక్టర్ చేయబోతుందనే వివరాలను మాత్రం ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంచారు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. దీపికా పదుకొణే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలరించనుండగా, యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 చివరినాటికి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయికి అవకాశం దక్కడంతో సిరి హనుమంతు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అవకాశానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

క్లాస్‌ మెసేజ్‌తో నటసింహం మాస్‌ విధ్వంసం..!

10 డేస్ ‘లెనిన్’ కలెక్షన్స్.. సెంచరీ కష్టమేనా

ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు.. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ వైరల్

Updated Date - Jul 20 , 2026 | 07:22 PM