సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బండి సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ చూశారా

ABN, Publish Date - Nov 06 , 2026 | 03:53 PM

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి విలక్షణ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను సృష్టించుకున్న నటుడు బండి సరోజ్ కుమార్. ఆయన నటిస్తోన్న తాజా చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది.

Chapri First Look

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి విలక్షణ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను సృష్టించుకున్న నటుడు బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar). ఆయన నటన, వినూత్నమైన కథల ఎంపిక, రా అండ్ ఇంటెన్స్ మేకింగ్ శైలికి ప్రత్యేకమైన అభిమాన గణం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తెరపై ఏ పాత్ర పోషించినా అందులో జీవించే ఆయన, ప్రతి విభాగంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తుంటారు. తాజాగా ఆయన మరో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రానికి ‘ఛప్రి’ (Chapri) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం.. ఇలా అన్ని ప్రధాన బాధ్యతలను స్వయంగా సరోజ్ కుమారే నిర్వర్తించడం విశేషం. ‘బీఎస్‌కే (BSK) మెయిన్ స్ట్రీమ్’ బ్యానర్‌పై సరోజ్ కుమార్‌తో కలిసి ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సరోజ్ సరసన ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి కథానాయికలుగా నటిస్తుండగా.. శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. స్లమ్ ప్రాంతంలో నివసించే ఓ సామాన్య యువకుడి జీవితం, అతడి ప్రేమ ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ జర్నీలో కొందరు ధనవంతులైన వ్యక్తులు అతడి జీవితంలోకి ప్రవేశించడం, వారి చర్యల వల్ల ఆ కుర్రాడి ప్రపంచం ఎలా తలకిందులైందనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సామాజిక అంతరాలు, అణచివేత, పగ, ప్రేమల నడుమ సాగే ఈ ప్రయాణంలో ఆ కుర్రాడు తన ప్రేమను దక్కించుకున్నాడా? సమాజంపై అతడు చేసిన పోరాటంలో గెలిచాడా? లేదా? అనే పాయింట్లను ఎంతో భావోద్వేగభరితంగా, ఉత్కంఠభరితంగా ఆవిష్కరించినట్లుగా సరోజ్ చెప్పుకొచ్చారు.


తాజాగా విడుదలైన ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ (Chapri First Look Poster) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బండి సరోజ్ కుమార్ మునుపెన్నడూ చూడని విధంగా పూర్తి రా అండ్ రస్టిక్ స్లమ్ కుర్రాడి గెటప్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌ను పరిశీలిస్తే కథలో హై-వోల్టేజ్ యాక్షన్ డోస్ గట్టిగానే ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. సరికొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్, విడుదల తేదీ వంటి పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

‘మహాకాళి’ నుంచి ‘అయిగిరి నందిని’ సాంగ్ విడుదల.. పూనకాలే

సాయి దుర్గ తేజ్ - కిరణ్‌ల నిశ్చితార్థం.. హాజరైన పలువురు సెలబ్రిటీలు

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు కాబోయే భార్య పేరు ఇదే..

Updated Date - Nov 06 , 2026 | 03:53 PM