Bandi Saroj: ప్రతిభ లేనివాళ్లే ఎఫైర్లు, కమిట్‌మెంట్ల వైపు వెళ్తారు
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:08 PM
నటుడు, దర్శకుడు యాక్టర్ బండి సరోజ్ కుమార్ (Bandi Saroj kumar) మరోసారి సోషల్ మీడియా పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు.
నటుడు, దర్శకుడు యాక్టర్ బండి సరోజ్ కుమార్ (Bandi Saroj kumar) మరోసారి సోషల్ మీడియా పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. తరచూ సామాజిక, సినీ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేసే ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అని చెప్పే ఫెమినిస్టులు... అవకాశాలు ఇస్తాం అంటే పడుకున్నాం. మమ్మల్ని వాడుకున్నారు' అని చెప్పే మాటల్ని ఎలా సమర్ధిస్తారు ? 'నువ్వే నీ లైవ్ హుడ్ కోసం వాడ్ని వాడుకున్నావ్' అనే యాంగిల్ లో కూడా ఎందుకు ఆలోచించరు ? సినిమాల్లో పనిచేయడానికి ఎక్కువమంది అమ్మాయిల కోసం వచ్చే చిల్లర గాళ్ళు ఉంటారు. అమ్మాయిలు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళంతా పరాన్నజీవులు. సొంతంగా ఏ ప్రతిభా లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి ఎఫైర్ లు, కమిట్మెంట్స్ పెట్టుకుంటారు. వాళ్ళు చేసే సినిమాలు వచ్చినట్టు కూడా తెలియవు. కానీ ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్ అలా ఉండరు. కొన్ని కేసులు వ్యక్తిగత ప్రతీకారం కోసం, ఇమేజ్ ని పాడు చేయడానికి చేసి కుటుంబాలను రోడ్డు మీదకి ఈడుస్తారు. అందుకే గుంపులో ఉండకండి.. చిల్లర గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అని తరచూ చెబుతుంటాను.. ప్రతిభ లేని చిల్లర మనుషులే తక్కువ టైం లో ఫేమస్ అయిపోవాలని, పగ తీర్చుకోవాలని ఆలోచిస్తుంటారు. ఎవరు సక్సెస్లో ఉన్నారా వాళ్ళని అల్లరి చేద్దామా అని రాబందుల్లాగా కాచుకుని కూర్చుంటారు' అని పోస్టులో పేర్కొన్నారు.
అయితే ఈ పోస్టులో సరోజ్ ఎవరి పేరును ప్రస్తావించలేదు. #Filmmaker #Actress #Controversy #TFI అనే హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రం జత చేశారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఓ వివాదాన్ని ఉద్దేశించే సరోజ్ ఈ వ్యాఖ్యలు చేశారా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇటీవల దర్శకుడు పవన్ సాధినేనిపై ఓ సినీ నటి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని ఆరోపిస్తూ కేసు పెట్టగా.. పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ వివాదం గురించే సరోజ్ పోస్ట్ చేసి ఉంటారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు