సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలయ్య-వివేక్ ఆత్రేయ ‘కురుక్షేత్రం’కు బ్రేక్?.. కారణం ఇదేనా

ABN, Publish Date - Nov 28 , 2026 | 07:29 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు పెరుగుతున్న కొద్దీ తన స్పీడ్ మరింత పెంచుతున్నారు. ఇప్పటి కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతున్నారు.

Balakrishna Vivek Athreya Film Update

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు పెరుగుతున్న కొద్దీ తన స్పీడ్ మరింత పెంచుతున్నారు. ఇప్పటి కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘దాదా’ (Dada) అనే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో బాలయ్య తొలిసారి చేతులు కలపబోతున్నారు. ఈ కాంబోపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, కొరటాల శివ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.


‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ, సరిపోదా శనివారం’ వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇలాంటి డైరెక్టర్, మాస్ గాడ్ బాలకృష్ణతో సినిమా చేస్తే ఎలా ఉంటుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అంతేకాదు, ఈ సినిమాకు ‘కురుక్షేత్రం’ (Kurukshetram) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా అనుకున్నారని, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏకంగా రెండు భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేసిందని టాక్ వినిపించింది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో, ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. వివేక్ ఆత్రేయ, బాలకృష్ణకు ఒక అద్భుతమైన కథను వినిపించారట. ఆ కథ విన్న వెంటనే బాలయ్యకు కూడా బాగా నచ్చిందట. కానీ, ప్రాజెక్ట్ పట్టాలెక్కే ముందు జరిగిన తుది చర్చల సమయంలో అసలు చిక్కు వచ్చిపడిందట. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని బాలకృష్ణ సూచించారట. అయితే, స్క్రిప్ట్‌లో బాలయ్య చెప్పిన ఆ మార్పులు చేస్తే, కథలోని అసలు ఆత్మ దెబ్బతింటుందని వివేక్ భావించారట. తన ఒరిజినల్ విజన్‌కు వ్యతిరేకంగా మార్పులు చేయడానికి ఆయన ఆసక్తి చూపలేదని సమాచారం. ఇలా ఇద్దరి ఆలోచనల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, పరస్పర అంగీకారంతోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టిందనేలా టాక్ నడుస్తోంది.


మరోవైపు, ఇటీవలి కాలంలో బాలకృష్ణ కథల ఎంపిక విషయంలో మునుపటి కంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ‘అఖండ 2’ ఫలితం తర్వాత, కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, బలమైన కంటెంట్ ఉన్న కథలకే బాలయ్య మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, బాలయ్య తనయ నందమూరి తేజస్విని కూడా ఇప్పుడు ఆయన సినిమాల కథా చర్చల్లో, ప్రాజెక్టుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ అంతా డిసెంబర్‌లో రాబోతున్న ‘దాదా’ సినిమా పైనే ఉంది. ఇక వివేక్ ఆత్రేయ, మాస్ మహారాజా రవితేజతో తన తదుపరి సినిమాను పట్టాలెక్కిస్తుననారు. ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజకీయ అంశాలు, క్రైమ్ కామెడీ, ఒక అందమైన ప్రేమకథ కలగలిసి ఉంటాయని తెలుస్తోంది. ఏది ఏమైనా, బాలకృష్ణ - వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ప్రస్తుతానికి విరామం తీసుకున్నప్పటికీ, భవిష్యత్తులో కచ్చితంగా బాలయ్యతో కలిసి పనిచేస్తానని వివేక్ ఆత్రేయ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విభిన్నమైన కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

ఏడు భాషల్లో విడుదలకు సిద్ధమైన ‘సీతన్నపేట గేట్’..

రామ్ చరణ్-సుకుమార్ ‘RC17’ రిలీజ్ ప్లాన్ ఇదేనా?

మోక్షజ్ఞ చిత్రంలో ఎన్టీఆర్.. థియేటర్లలో విధ్వంసమే

Updated Date - Nov 28 , 2026 | 07:29 PM