Dada: బాలయ్య ఫ్యాన్స్‌కు మ్యూజికల్ ట్రీట్.. ‘దాదా’ అప్డేట్
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:24 PM
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దాదా’ చిత్రం నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దాదా’. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి బాలయ్యను పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించేందుకు గోపీచంద్ మలినేని సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు థమన్ అందించే పాటలపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి.
బాలకృష్ణ సినిమాలకు థమన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘దాదా’ ఆల్బమ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా తొలి పాటను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. ఇదే నిజమైతే దీపావళికి బాలయ్య అభిమానులకు పండగే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాజల్, నర్గిస్ ఫక్రి నాయికలుగా నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ:
IFFA: ఐఫా వేడుకల్లో ధురంధర్ జోరు.. రణ్‌వీర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం!
DSP: దేశవ్యాప్తంగా ఫోక్ ఆర్టిస్టులు ఒక్కచోట.. ‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ స్పెషల్!
సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్ చేశారేంటి?