Balayya Viral Video: ఈవెంట్ లో జరిగింది వేరు, సామాజిక మాధ్యమాల్లో చూపించేది వేరు

ABN , Publish Date - May 30 , 2024 | 12:15 PM

'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమా ప్రీ విడుదల వేడుకలో బాలకృష్ణ, నటి అంజలిని నెట్టేస్తున్నట్టుగా వున్న వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది ఆ వీడియో ముందు, వెనకాల తీసేసి కేవలం బాలకృష్ణ, అంజలిని పక్కకి నెట్టేస్తున్న భాగం మాత్రమే చూపిస్తూ, బాలకృష్ణకి మహిళల పట్ల గౌరవం లేదని ట్రోల్ చేస్తున్నారు. అయితే చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ అక్కడ జరిగింది వేరు, చూపించేది వేరు అని చెపుతూ బాలయ్యపై ట్రోల్స్ ఆపాలని చెప్పారు

Balayya Viral Video: ఈవెంట్ లో జరిగింది వేరు, సామాజిక మాధ్యమాల్లో చూపించేది వేరు
Nandamuri Balakrishna at Gangs of Godavari Pre Release event

నందమూరి బాలకృష్ణ 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' ప్రీ విడుదల వేడుక కి ప్రత్యేక అతిధిగా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బాలకృష్ణ సరదాగా చేసిన ఒక సన్నివేశాన్ని వీడియోలో ముందు వెనకాల తీసేసి, కేవలం బాలకృష్ణ, నటి అంజలిని పక్కకి నెట్టారని సామాజిక మాధ్యమాల్లో కొందరు వైరల్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ వీడియోపై 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' చిత్ర నిర్మాత, ఆ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ లు స్పందించారు.

balayyaanjali.jpg

చిత్ర సభ్యులు అందరితో కలిసి బాలకృష్ణ ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో నటి అంజలిని బాలయ్య పక్కకు జరగమని చెప్పగా అంజలి సరిగా వినిపించుకోలేదు. దీనితో బాలకృష్ణ ఆమెను పక్కకు నెట్టారు. అంజలి షాక్ అయినా, తరువాత ఆ విషయాన్ని సరదాగా తీసుకొని నవ్వేసింది కూడా, బాలకృష్ణతో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. అయితే కొంతమంది ఈ విషయం గురించి వివాదం చెయ్యాలని అనుకున్నారేమో, అందుకని ఈ వీడియో ముందు, వెనకాల తీసేసి, కేవలం బాలకృష్ణ, అంజలిని నెట్టడం వరకే చూపిస్తూ, బాలకృష్ణకి మహిళలంటే గౌరవం లేదని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ విషయంపై విశ్వక్ సేన్ స్పందిస్తూ, "ఈవెంట్ లో జరిగింది వేరు, సామాజిక మాధ్యమాల్లో చూపించేది వేరు. దానిని ముందు వెనుక కట్ చేసి ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారు. బాలయ్య ఎప్పుడూ అందరితో సరదాగా వుంటారు. ఆయనపై ట్రోల్స్ ఆపండి", అని విశ్వక్ తెలిపారు. ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన చిన్న సరదా విషయాన్ని వివాదం చేయొద్దు అని నిర్మాత నాగవంశీ తెలిపారు. పైగా ఈ ఈవెంట్ లో బాలయ్య లిక్కర్ సేవించారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలను షేర్ చేయటంపై కూడా స్పందించారు. "అదంతా గ్రాఫిక్ వర్క్" అని నిర్మాత నాగవంశీ కొట్టిపాడేశారు.‌ ఇదే ఈవెంట్ లో బాలయ్య పక్కనే తాను వున్నానని, కానీ తనకు ఏ బాటిల్ కనిపించలేదని చెప్పారు. వీడియోలో మాత్రం కావాలని చిన్న బాటిల్ ను పెట్టినట్లుగా వంశీ తెలిపారు.

Updated Date - May 31 , 2024 | 12:49 PM