Balakrishna: సంబరాల సాయిని సర్‌ప్రైజ్ చేశారు..
ABN, Publish Date - Jul 09 , 2026 | 05:51 PM
నందమూరి బాలకృష్ణ (NBK) మెగా హీరోని సర్‌ప్రైజ్ చేశారు. అంతే కాదు ఒక్కసారిగా సినిమా టీమ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
నందమూరి బాలకృష్ణ (NBK) మెగా హీరోని సర్‌ప్రైజ్ చేశారు. అంతే కాదు ఒక్కసారిగా సినిమా టీమ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. సాయి ధరమ్ తేజ్ (Sai durga tej) హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌ను బాలయ్య అనూహ్యంగా సందర్శించి చిత్ర బృందానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన రాకతో సెట్స్‌లో హంగామా మొదలైంది. తేజ్ కాసేపు బాలయ్యతో ఆప్యాయంగా మాట్లాడారు. దర్శకుడు కె.పి.రోహిత్, నిర్మాత నిరంజన్‌రెడ్డి, సాంకేతిక నిపుణులతో కూడా మాట్లాడి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సినిమా నిర్మాణానికి నిర్మాతలు ఏమాత్రం రాజీపడటం లేదని తెలుసుకుని బాలయ్య వారిని ప్రశంసించారని తెలిసింది. సినిమా సక్సెస్ కావాలని బాలయ్య ఆకాంక్షించారని చిత్ర బృందం చెబుతోంది. చిత్ర బృందం అంకితభావంతో పని చేేస్త ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుందని బాలయ్య చెప్పినట్లు టీమ్ వెల్లడించింది. అంతే కాదు బాలయ్య ఆకస్మిక సందర్శనతో యూనిట్‌లో మరింత ఉత్సాహం కనిపించింది.
సాయి దుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు కె.పి.రోహిత్ దర్శకుడు. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపిస్తారు. అసుర ఆగమనం’ పేరుతో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం సాయితేజ్ ఎంతో కృషి చేస్తున్నారు. ‘బ్రో’ తర్వాత ఆయన చేయాలనుకున్న రెండు చిత్రాలు ఆగిపోయాయి. తదుపరి ఈ సినిమా ఖరారైంది.
ఇవి కూడా చదవండి:
బాలయ్య సినిమాలో రోల్‌పై కాజల్ షాకింగ్ కామెంట్స్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ - ఒక బ్యాడ్ న్యూస్
బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటర్: సోనాలి బింద్రే