సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

ABN, Publish Date - May 29 , 2026 | 04:56 PM

మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK111 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీలో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది.

NBK111 Update

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాస్ జాతర థియేటర్స్‌లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య వరుస సక్సెస్‌లతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం NBK111 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు అంతకు మించిన పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాను షేక్ చేసే ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. జూన్ నెలలో నందమూరి అభిమానులకు ఒక భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.


నిజానికి ఈ సినిమాను ఒక పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ డ్రామాగా మొదలుపెట్టారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఆశించే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా ఉండేలా కథను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక తదుపరి వేట కోసం చిత్రయూనిట్ బాలీవుడ్ అడ్డాకు బయలుదేరుతోంది. జూన్ 7 నుంచి ముంబైలో ఒక భారీ సరికొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. జూన్ 10వ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈసారి ఆ పండగను డబుల్ చేయడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్ చేశారు. జూన్ 10న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు, ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ గ్లింప్స్ బాలయ్య మార్క్ డైలాగ్స్, విజువల్స్‌తో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందట. ఈ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన పాత్రలన్నింటి కంటే ఈ చిత్రంలో ఆయన రోల్ పూర్తిగా భిన్నంగా, సరికొత్తగా ఉండబోతుందట. ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో బాలయ్య స్క్రీన్‌పై విశ్వరూపం చూపించబోతున్నారని ఇన్‌సైడ్ టాక్.


ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిన మరో సెన్సేషనల్ అప్‌డేట్ ఏంటంటే.. ముంబైలో జరగబోయే ఈ కొత్త షెడ్యూల్‌లో వైవిధ్యభరిత నటుడు మంచు మనోజ్ కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఫిలిం నగర్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్యకు తమ్ముడిగా నటిస్తూనే, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మనోజ్ కనిపించబోతున్నారట. బాలయ్య లాంటి పవర్‌ఫుల్ పర్సనాలిటీ ముందు నెగిటివ్ రోల్‌లో మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. మొత్తానికి ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ హిట్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడం, దానికి తోడు బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్, మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ తోడవ్వడంతో NBK111 పై ట్రేడ్ వర్గాల్లో సైతం అద్భుతమైన క్రేజ్ క్రియేట్ అవుతోంది. మరి జూన్ 10న రాబోయే ఆ బర్త్‌డే ట్రీట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

Updated Date - May 29 , 2026 | 04:56 PM