బాలయ్య - కొరటాల శివ ప్రాజెక్ట్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా!
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:50 PM
గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మెసేజ్ ప్లస్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ కొరటాల శివతో ఆయన సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ అలసట వస్తుంది. కానీ, ఈ ఏజ్‌లో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ, జెట్ స్పీడ్‌తో సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు నటసింహం బాలయ్య (Natasimham Balakrishna). ‘అఖండ’ సినిమాతో మొదలైన ఈ ఊపు.. ‘వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ-2’ సినిమాలతో కంటిన్యూ అవుతూ.. ఇప్పుడు టాప్ పొజిషన్‌లో దూసుకెళ్తున్నారు. అంతే కాక ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరో ఎవరు? అంటే ఆలోచించకుండా చెప్పే పేరు కూడా బాలయ్యదే. సాధారణంగా సీనియర్ హీరోలు ఒక సినిమా పూర్తి చేశాక కాస్త గ్యాప్ తీసుకుని మరో సినిమా గురించి ఆలోచిస్తారు. కానీ బాలయ్య రూటే సపరేట్..! ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీని గురించి ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే.. మొదట పీరియాడికల్ డ్రామాగా అనుకున్న ఈ కథ, ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ మలినేని మాస్ టేకింగ్ పై ఆడియెన్స్‌లో నమ్మకం ఉండడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలయ్య మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మెసేజ్ ప్లస్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ, మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని ఫిలిం నగర్ టాక్. యువసుధా ఆర్ట్స్ అలాగే SLV సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నాయట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే సందేహం ఫ్యాన్స్‌లో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ లేదా జూలై నుంచి షూటింగ్ మొదలుపెట్టి, అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా హుందాగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మరి బాలయ్యను కొరటాల ఎలా చూపిస్తారో? అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఒకవైపు గోపీచంద్ మలినేని సినిమా.. మరోవైపు కొరటాల శివ ప్రాజెక్ట్.. బాలయ్య వేగం చూస్తుంటే మిగతా హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. తన సినిమా పూర్తి కాకముందే మరో పెద్ద దర్శకుడితో ప్రాజెక్ట్ ఓకే చేయడం, వెంటనే షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం కేవలం బాలయ్యకే సాధ్యం. అందుకే ఆయన అభిమానులు ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోషల్ మెసేజ్‌తో పాటు బాలయ్య క్రేజ్‌ను రెట్టింపు చేసేలా ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాలయ్య తన సినిమాలతో అటు ఫ్యాన్స్‌ను, ఇటు నిర్మాతలను ఖుషీ చేస్తున్నారు. మరి కొరటాల శివ - బాలయ్య కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!
పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!
ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!