సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాక్ స్టార్ దేవిశ్రీ వదిలిన ‘బా బా బ్లాక్ షీప్‌’ ఫ‌స్ట్ లిరిక‌ల్‌ ‘ఆజా మేరీ జాని’ సాంగ్

ABN, Publish Date - Aug 15 , 2026 | 04:19 PM

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ విడుదల చేశారు.

DSP Launches Baa Baa Black Sheep Movie Song

దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’ (Baa Baa Black sheep). అనుకోకుండా జ‌రిగే ఓ ఘ‌ట‌న.. కొన్ని జీవితాల్లోనూ అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టానికి కార‌ణ‌మైతే.. అలాంటి ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాల‌యా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను ఏర్పడేలా చేయగా, తాజాగా మేకర్స్ చిత్ర విడుదల తేదీతో పాటు, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రిలీజ్ చేశారు.


సాంగ్ విడుదల అనంతరం దేవిశ్రీప్ర‌సాద్ మాట్లాడుతూ.. సాంగ్ యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌ని, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుతూ.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇక ‘ఆజా మేరీ జాని’ సాంగ్ విష‌యానికి వ‌స్తే.. ఇదొక పార్టీ సాంగ్‌ అని తెలుస్తోంది. ప్ర‌ధానంగా అక్షయ్ ల‌గుసాని, విష్ణు ఓయ్ ల‌పై ఈ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా చిత్రీక‌రించారు. ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం అందించగా.. బెన్నీ ద‌యాల్ పాడారు.


ఈ పాట విడుదల సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చుట్టూ తిరిగే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘బా బా బ్లాక్ షీప్’ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 9న సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. మేఘాల‌యా రాష్ట్రంలో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిగా కంప్లీట్ చేసిన తొలి ద‌క్షిణాది సినిమా ఇది. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుత‌మైన లొకేష‌న్స్‌లోనూ చిత్రీక‌రించాం. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. మా డైరెక్ట‌ర్ గుణి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హా అందరూ ఎంతగానో సహకరించారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని అప్‌డేట్స్‌‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే

నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్

‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా

Updated Date - Aug 15 , 2026 | 04:42 PM