సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు క్యూ.. ‘పెద్ది’ సారూ?

ABN, Publish Date - Jul 27 , 2026 | 05:23 PM

అనిల్ రావిపూడి.. టాలీవుడ్‌లో ఈ దర్శకుడి పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ‘పటాస్’ (Patas) సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ హిట్ మెషిన్.. అపజయమెరుగని దర్శకుడిగా దూసుకెళుతున్నారు.

Director Anil Ravipudi

అనిల్ రావిపూడి (Anil Ravipudi).. టాలీవుడ్‌లో ఈ దర్శకుడి పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ‘పటాస్’ (Patas) సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ హిట్ మెషిన్ ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం’.. సహా ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరకు అన్ని చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడే కావడం విశేషం. ప్రస్తుతం నిర్మాతలకు అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. కథలో కామెడీకి పెద్దపీట వేయడంతో పాటు, అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసే అలవాటు కూడా నిర్మాతల్లో ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచింది.


ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram)తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ మల్టీస్టారర్‌ను నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ నిర్మాతలు అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘పెద్ది’ (Peddi) నిర్మాత వెంకట సతీష్ కిలారుతో అనిల్ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత ఇప్పటికే భారీ అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కూడా ఒక సినిమాను అంగీకరించినట్లు టాక్. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా అనిల్ రావిపూడి చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ నవీన్‌తో చాలా కాలంగా సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో సాహు గారపాటి, వెంకట సతీష్ కిలారు, మైత్రీ మూవీ మేకర్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలతో అనిల్ రావిపూడి వరుసగా సినిమాలు చేసే అవకాశం కనిపిస్తోంది.


ఒకవైపు తమ ఇమేజ్‌కు తగ్గ కథలను అందించగల డైరెక్టర్‌గా, మరోవైపు షూటింగ్‌ను అనుకున్న టైమ్‌కు పూర్తి చేసే మేకర్‌గా ఆయనకు ఉన్న పేరు నిర్మాతల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. అందుకే సినిమా మొద‌లుపెట్టడానికి చాలా ముందే అత‌ని డేట్స్‌ను లాక్ చేసే వ్యూహాన్ని నిర్మాణ సంస్థలు అనుసరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ప్రాజెక్ట్ లేటైతే దాని ఎఫెక్ట్ త‌ర్వాతి సినిమాల‌పై కూడా పడే అవకాశం ఉండటంతో, లాంగ్‌టర్మ్ ప్లానింగ్‌కు నిర్మాత‌లు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల డేట్స్ మాత్రమే కాదు, స్టార్ డైరెక్టర్ల‌ అందుబాటు కూడా కీలక అంశంగా మారుతోంది. ఒక స‌క్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో సినిమా చేయడం ఇప్పుడు కేవలం క్రియేటివ్ డెసిష‌న్ మాత్రమే కాకుండా, బిజినెస్ స్ట్రాట‌జీగానూ మారిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో అనిల్ రావిపూడి షెడ్యూల్ చుట్టూనే పలువురు హీరోలు, నిర్మాతలు తమ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారనే డిస్కష‌న్ సినీ వర్గాల్లో కొనసాగుతోంది. అందులో భాగంగానే అనిల్ కోసం టాలీవుడ్ లోని ప‌లు అగ్ర నిర్మాణ సంస్థలు క్యూ క‌డుతున్నాయ‌ని, వారిలో కొంద‌రికి అనిల్ ఆల్రెడీ సినిమా చేయ‌డానికి క‌మిట్‌మెంట్ కూడా ఇచ్చార‌ని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

మరీ ఈ రేంజ్‌లోనా.. ఆదర్శకుటుంబం వెంకీ పాత్ర రివీల్

‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం

200 మిలియన్ వ్యూస్‌.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్

Updated Date - Jul 27 , 2026 | 05:40 PM