సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అన్న సినిమా రిలీజ్ డేట్‌పై కన్నేసిన ఆనంద్ దేవరకొండ!

ABN, Publish Date - Jul 23 , 2026 | 02:03 PM

యువ హీరో ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ డేట్‌పై కన్నేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఎపిక్’. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Epic Movie Release Update

యువ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మరోసారి జంటగా నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్‌’ (Epic). వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బేబీ’ (Baby) మూవీ సూపర్ హిట్ కావడంతో ‘ఎపిక్’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చాయి. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘ఎపిక్’ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రిలీజ్ డేట్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.


ఆసక్తికర విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 11 తేదీని మొదట విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న ‘రణబాలి’ (Ranabaali) సినిమా కోసం అనుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో విడుదల వాయిదా పడినట్లు సమాచారం. దీంతో ఖాళీ అయిన ఆ రిలీజ్ స్లాట్‌ను ‘ఎపిక్’ వినియోగించుకోనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రిలీజ్ స్లాట్ చుట్టూ చర్చకు రావడం కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ‘ఎపిక్’ చిత్రానికి ప్రముఖ వెబ్ సిరీస్ 90’s తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువతను ఆకట్టుకునే హాస్యం, కాలేజ్ బ్యాక్‌డ్రాప్, ప్రేమకథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.


90’s’లో కనిపించిన సహజమైన కథనం, వినోదాన్ని ఈ చిత్రంలోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. అయితే సెప్టెంబర్ 11 రిలీజ్ ఖరారైతే, ఈ ఏడాది యూత్ ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్లలో ‘ఎపిక్’ ఒకటిగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

మా అన్నయ్య మెగాస్టార్‌కు.. నేను పవర్ స్టార్‌కు అభిమానులం: కిరణ్ అబ్బవరం

మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం

నందమూరి హీరోతో పరశురామ్ సినిమా! వర్కౌట్ అయ్యేనా..

Updated Date - Jul 23 , 2026 | 02:03 PM