నందమూరి హీరోతో పరశురామ్ సినిమా! వర్కౌట్ అయ్యేనా..

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:19 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎమోషన్లు, యూత్‌ఫుల్ మ్యాజిక్, కమర్షియల్ హంగులను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసి చూపించగల కొద్దిమంది దర్శకుల్లో పరశురామ్ ఒకరు. ఆయనిప్పుడు నందమూరి హీరోతో సినిమాకు రెడీ అవుతున్నారు.

Kalyan Ram and Parasuram

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఎమోషన్లు, యూత్‌ఫుల్ మ్యాజిక్, కమర్షియల్ హంగులను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసి చూపించగల కొద్దిమంది దర్శకుల్లో పరశురామ్ (Director Parasuram) ఒకరు. పూరీ జగన్నాథ్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి క్రేజీ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, తన ప్రయాణంలో ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. ‘యువత, ఆంజనేయులు, సోలో’ వంటి చిత్రాలతో ఫ్యామిలీ, కామెడీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన పరశురామ్.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో తీసిన ‘గీత గోవిందం’ (Geetha Govindham)తో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి స్టార్ డైరెక్టర్ల సరసన చేరారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ వంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు.


ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన నందమూరి కళ్యాణ్ రామ్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇటీవల కళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram)కు పరశురామ్ వినిపించిన కథాంశం బాగా నచ్చడంతో, ప్రస్తుతం కథలోని కొన్ని చిన్నపాటి మార్పులపై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పరశురామ్ గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో, ఈసారి కళ్యాణ్ రామ్ సినిమాతో మళ్లీ స్ట్రాంగ్ హిట్ ట్రాక్ ఎక్కాలని పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. మరోవైపు అటు ‘బింబిసార’ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. దీంతో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఈ పరశురామ్ కాంబినేషన్‌పై కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం కళ్యాణ్ రామ్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ భారీ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ మల్టీస్టారర్‌తో ఎలాగో కళ్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని, ఆ తర్వాత పరశురామ్ మూవీతో అది కంటిన్యూ కావాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ సెట్స్‌పై ఉండగానే పరశురామ్ సినిమా కూడా ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి కళ్యాణ్ రామ్, పరశురామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో!.

ఇవి కూడా చదవండి:

‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ ట్రైలర్ వదిలిన చిరు.. ఏమన్నారంటే

నేను పొందిన పిత్రోత్సాహం.. వారు కూడా పొందాలి కదా: చిరంజీవి

ఏడు నెలల పోరాటం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ‘జననాయగన్‌’ ఫీవర్‌

Updated Date - Jul 23 , 2026 | 12:19 PM