మా అన్నయ్య మెగాస్టార్‌కు.. నేను పవర్ స్టార్‌కు అభిమానులం: కిరణ్ అబ్బవరం

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:40 PM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు.

Chennai Love Story Pre Release Event

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రం రవి నంబూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. జూలై 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్, స్టోరీ రైటర్ సాయి రాజేష్ (Sai Rajesh) మాట్లాడుతూ.. మా అన్నయ్య మా కోసం వచ్చారు. ఈ రోజు నన్ను హీరోను చేశారు. శిల్పకళావేదిక చిరంజీవి అభిమానులకు ఒక ఎమోషన్. మన అభిమానులకు ఈ ఆడిటోరియంతో ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు ఉంటాయి. చిరంజీవి మా ఈవెంట్‌కు వస్తున్నారని తెలియగానే ఎంతోమంది స్నేహితులు ఫోన్ చేసి అడిగారు. మా సినిమా ఈవెంట్‌కు మీరొస్తే మా మూవీకి హెల్ప్ అవుతుంది అన్నయ్య అని అడిగితే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా.. నేను వస్తున్నా.. అన్నీ ఏరేంజ్ చేసుకోమని చెప్పారు. ఇది చాలు అన్నయ్యా.. అని అన్నారు.


ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ (SKN) మాట్లాడుతూ.. బాస్ అంటే మనం పెంచుకున్న తోట, మనం కట్టుకున్న కోట, మనం ఎంచుకున్న బాట.. అదీ మెగాస్టార్ అంటే. ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడే మెగాస్టార్. మా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మెగాస్టారే కదిలి రావడం సంతోషంగా ఉంది. నాకు, సాయి రాజేష్‌కు ఫైనాన్స్ లెక్కలు తెలియవు. ఒక మంచి సినిమాను వీలైనంత క్వాలిటీగా నిర్మించడమే తెలుసు. కిరణ్‌కు ఈ కథ చెప్పగానే నేను చేస్తాను అని ముందుకొచ్చారు. నా స్నేహితుడు రవి నంబూరి కొత్త దర్శకుడైనా అద్భుతంగా రూపొందించారు. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇది ప్రమోషనల్ ఈవెంట్ కాదు.. మాకు ఎమోషనల్ ఈవెంట్. బాస్ అభిమానులుగా మేము ఎప్పుడూ మంచి ప్రేమ కథల్నే తెరకెక్కిస్తామని తెలిపారు.


హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ శిల్పకళావేదికలో మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలకు చెందిన ఎన్ని ఈవెంట్స్ చూసి ఉంటాం. ఎక్కడో మా ఊర్లో ఉండి టీవీలో మెగాస్టార్ సినిమా ఈవెంట్స్ చూసేవాడిని. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా ఈవెంట్‌కు ఆ మెగాస్టారే అతిథిగా రావడం నా జీవితంలో మర్చిపోలేని సందర్భం. డ్యాన్సులైనా, పర్ ఫార్మెన్స్ అయినా, స్వాగ్ అయినా మెగాస్టార్ ఎప్పుడూ మనకు ప్రత్యేకమే. మా అన్నయ్య మెగాస్టార్ అభిమాని. నేను పవర్ స్టార్ అభిమానిని. థియేటర్స్‌లో మేము కట్టిన బ్యానర్స్, చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిరంజీవి అనేది పేరు కాదు.. మాకొక ఎమోషన్. మీరు ఎవరెస్ట్ మీద కూర్చుని మమ్మల్ని కూడా అలసిపోకుండా అక్కడికి పరుగులు పెట్టండి అంటూ స్ఫూర్తి నింపుతున్నారు. మీరూ అఛీవ్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంటారు. అప్పుడు అనిపిస్తుంటుంది మనమూ చిరంజీవినే కదా అని. నా మాటగా చెబుతున్నా.. ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమాకు వెళ్లండి. తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం

నందమూరి హీరోతో పరశురామ్ సినిమా! వర్కౌట్ అయ్యేనా..

‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ ట్రైలర్ వదిలిన చిరు.. ఏమన్నారంటే

Updated Date - Jul 23 , 2026 | 01:40 PM