మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:10 PM

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Gabbar Singh Ramesh in Hospital

పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ (Pawan Kalyan Gabbar Singh) చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేష్ (Ramesh) బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఐసియు (ICU)లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కష్టకాలంలో రమేష్‌కు ఆయన కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు (Nagababu), దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) అండగా నిలబడి.. ధైర్యం చెబుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే అపోలో ఆస్పత్రిలో ఉన్న రమేష్‌ ఆరోగ్యపరిస్థితి ఏంటనేది డాక్టర్స్‌ని అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రమేష్ కోలుకుని, ఎప్పటిలానే తిరిగి రావాలంటూ తన తోటి టీమ్ కన్నీరుమున్నీరవుతున్నారు.


ఈ సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ టీమ్ మాట్లాడుతూ.. ‘‘మేము పవన్ సార్‌కి మెసేజ్ పెట్టడం జరిగింది. పవన్ సార్ ఆఫీస్ నుంచి అపోలో వారికి కాల్ వచ్చింది. అలాగే నాగబాబు సార్‌‌కు కాల్ చేశాం. నాగబాబు సార్‌కి కాల్ చేయగానే ‘నేను ఇప్పుడు ఇక్కడ లేను, బయట ఉన్నా’ అని చెప్పేసి.. వాళ్ల పిఏకి చెప్పి రూ. 2 లక్షలు ఇచ్చి పంపించారు. ఇంకోటి మా హరీష్ శంకర్ సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ‘ఎలా ఉన్నార్రా? నేను కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకండి. మేము ఉన్నాం, మేమందరం ఉన్నాం కదా టెన్షన్ పడకండి’ అని చెప్పేసి దాదాపు ఇప్పటికి ఒక ఐదారు సార్లు ఆయనే ఫోన్ చేశారు.


హరీష్ శంకర్ సార్, పవన్ సార్.. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాము. మా రమేష్ మాకు.. మాకు కావాలా.. మాకు కావాలి సార్! హాస్పిటల్‌ నుంచి తను నవ్వుతూ బయటికి రావాలి, మళ్లీ ఆయన షూటింగ్‌లు చేయాలి, సినిమాలు చేయాలి, తెలుగు ప్రేక్షకులందరినీ నవ్వించాలి’’ అంటూ ‘గబ్బర్ సింగ్’ టీమ్ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం రమేష్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది అపోలో ఆస్పత్రి డాక్టర్లు, యాజమాన్యం ప్రకటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

నందమూరి హీరోతో పరశురామ్ సినిమా! వర్కౌట్ అయ్యేనా..

‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ ట్రైలర్ వదిలిన చిరు.. ఏమన్నారంటే

నేను పొందిన పిత్రోత్సాహం.. వారు కూడా పొందాలి కదా: చిరంజీవి

Updated Date - Jul 23 , 2026 | 01:10 PM