సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కొత్త హీరో.. కొత్త ప్రేమకథ

ABN, Publish Date - Jul 30 , 2026 | 05:41 PM

ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పేందుకు వచ్చేస్తోంది 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి' సినిమా. థియేటర్లలో ఆగస్టు 7న ఈ ప్రేమకథా చిత్రం సందడి చేయనుంది.

suman

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజ రెడ్డి నిర్మించిన సరికొత్త ప్రేమ కథా చిత్రం 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి'. లండన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న పవన్ మహావీర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతుండగా, వర్షిక, సుహానా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన శివాల ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ తదితర సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో తన రోల్ విలక్షణంగా ఉంటుందని, ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, తొలి సినిమానే అయినా పవన్ మహావీర్ నటనలో ఎంతో పరిణితి చూపించాడని, అతనికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంద'ని అన్నారు. అలాగే నిర్మాత శైలజ రెడ్డి తొలి చిత్రమే అయినా ఎంతో అనుభవం ఉన్నవారిలా ఈ ప్రాజెక్ట్‌ను ముందడుగు వేయించారని సుమన్ ప్రశంసించారు. దర్శకుడు ప్రభాకర్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా మలిచారని అభినందించారు.

నిర్మాత శైలజ రెడ్డి మాట్లాడుతూ,' సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులంతా ఆదరించాల'ని కోరారు. హీరో పవన్ మహావీర్ మాట్లాడుతూ, 'సెట్స్‌లో సీనియర్ హీరో సుమన్ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని, ఈ చిత్రం అందరినీ అలరిస్తుంద'ని అన్నారు. కథానాయికలు వర్షిక, సుహానా కూడా సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సాయి కార్తీక్ సంగీతం, మహేందర్ ఎం. ఛాయాగ్రహణం, నందమూరి హరి ఎడిటింగ్ అందించిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతోంది.

ఇవి కూడా చదవండి:

Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే

Updated Date - Jul 30 , 2026 | 05:41 PM