Happy: రీ రిలీజ్‌లోనూ.. ‘హ్యాపీ’ సంచలనం
ABN, Publish Date - Jun 14 , 2026 | 04:05 PM
అల్లు అర్జున్ (Allu Arjun) కు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో.. మాలీవుడ్‌లోనూ అంతే క్రేజ్ ఉంది. అక్కడ ఆయనకు అభిమానుల సంఖ్య ఎక్కువ.
అల్లు అర్జున్(Allu Arjun) కు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో.. మాలీవుడ్‌లోనూ అంతే క్రేజ్ ఉంది. అక్కడ ఆయనకు అభిమానుల సంఖ్య ఎక్కువ. అందుకే బన్నీని మల్లూ అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన నటించిన ప్రతి చిత్రం మలయాళ భాషలో తప్పనిసరిగా విడుదలవుతుంది. కరుణాకరన్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘హ్యాపీ’ (Happy) చిత్రం మలయాళంలో ఇటీవల రీ - రిలీజ్ అయింది.
అక్కడ ‘హ్యాపీ బీ హ్యాపీ’ టైటిల్‌తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మలయాళ అభిమానులు. థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. స్క్రీన్ ముందు డాన్స్‌లు, హంగామా చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సరసన జెనీలియా నటించిన ఈ చిత్రానికి ఎ కరుణాకరన్ దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మించారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!
‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?
వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!