సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్.. దర్శకుడెవరంటే?

ABN, Publish Date - Oct 17 , 2026 | 03:01 PM

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. బాక్సాఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు బద్దలవ్వడం, థియేటర్ల వద్ద రచ్చ లేవడం ఖాయం.

Allu Arjun and Jr NTR

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. బాక్సాఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు బద్దలవ్వడం, థియేటర్ల వద్ద రచ్చ లేవడం ఖాయం. ప్రస్తుతం అలాంటి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. ఇద్దరూ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్త. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన మార్క్ డార్క్ కామెడీతో పాటు అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్‌తో భారీ విజయాలు అందుకున్న నెల్సన్.. తారక్, బన్నీల స్టార్‌డమ్‌ను బ్యాలెన్స్ చేసేలా ఒక క్రేజీ సబ్జెక్ట్‌ను లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్టోరీ లైన్‌ను ఇద్దరు హీరోలకూ వినిపించారని, వారి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని ఇన్‌సైడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులకు తెరలేవడం ఖాయం.


ప్రస్తుతం ఈ ఇద్దరి రేంజ్ వేరే లెవెల్‌లో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్‌గా తారక్ తన నటనా విశ్వరూపాన్ని చాటిచెప్పారు. అటు ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించి నేషనల్ లెవెల్ సెన్సేషన్ అయ్యారు. అద్భుతమైన నటన, అదిరిపోయే డ్యాన్స్, అదిరే ఎమోషన్స్.. ఇలా ఏ విషయంలో చూసినా ఇద్దరికీ ఇద్దరే సాటి. అలాంటి స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు అంతకంటే పెద్ద పండగ ఏముంటుంది? అయితే ఇలాంటి భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే కేవలం క్రేజ్ మాత్రమే సరిపోదు. ఇద్దరి ఇమేజ్‌కు పూర్తి న్యాయం చేసే బలమైన కథ, ప్రతి నిమిషం గూస్‌బంప్స్ తెప్పించే స్క్రీన్‌ప్లే ప్రధాన బలంగా మారాలి.

ఈ కాంబో వినడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ, వెంటనే పట్టాలెక్కడం కాస్త సవాలుతో కూడుకున్న పనే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు అల్లు అర్జున్ ‘రాకా’తో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ సినిమాను లైన్‌లో పెట్టారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. అటు నెల్సన్ ప్రాజెక్టులపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇద్దరు స్టార్ హీరోల కాల్షీట్లను సర్దుబాటు చేసి, బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కచ్చితంగా సమయం పడుతుంది.


ఇక తెరవెనుక తారక్, బన్నీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరినొకరు ఆప్యాయంగా ‘బావ’ అని పిలుచుకోవడం, పుట్టినరోజులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చూపించే అనుబంధం చూస్తే.. సరైన కథ, సమయం కుదిరితే వీరు కలిసి నటించడానికి ఏమాత్రం వెనుకాడరనేది సినీ విశ్లేషకుల మాట. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్, అల్లు అర్జున్ లేదా నెల్సన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఇవన్నీ ఇండస్ట్రీ టాక్ మాత్రమే అయినప్పటికీ.. ఒకవేళ ఈ సినిమా సెట్స్‌పైకి వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల సునామి రావడం ఖాయం.

ఇవి కూడా చదవండి:

‘కల్కి 2’ షూటింగ్‌పై అప్‌డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్

దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?

‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

Updated Date - Oct 17 , 2026 | 03:01 PM